క్రైమ్ మిర్రర్, సినిమా:- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం రాకా ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో అల్లు అర్జున్ కనిపించిన తీరు ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు చూడని కొత్త లుక్‌గా అభిమానులను ఆశ్చర్యపరిచింది.పుష్ప సిరీస్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం కావడం, అలాగే జవాన్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అట్లీ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం రాకా ఒక హై-వోల్టేజ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, తాజాగా రాకా చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదలపై సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, ఈ గ్లింప్స్ ద్వారా సినిమా ప్రపంచం, కథా నేపథ్యం, విజువల్ స్కేల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు, ఈ చిత్రంలో అల్లు అర్జున్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కథ పునర్జన్మల నేపథ్యంలో సాగుతుందని, మూడు వేర్వేరు కాలాలకు చెందిన పాత్రల్లో ఆయన కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశాలపై కూడా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కీలక పాత్రలో నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. మొత్తం మీద రాకా పై రోజురోజుకు అంచనాలు పెరుగుతుండగా, గ్లింప్స్ విడుదలపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2027 రెండోార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
విశ్వక్, రామ్ తర్వాత.. ఇప్పుడు కిరణ్ అబ్బవరం వంతు..!
తెలుగు హీరో సుహాస్‌కు తమిళంలో భారీ ఛాన్స్.. రూ.80 కోట్ల సినిమాలో కీలక పాత్ర!