విజయవాడ, క్రైమ్ మిర్రర్ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని చంద్రబాబు దంపతులు పటమట అన్న క్యాంటీన్ కు వెళ్లారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు, కార్మికులు, ప్రజల మధ్య సాదాసీదాగా జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్నక్యాంటీన్ లబ్ధిదారులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అల్పాహారాన్ని ముఖ్యమంత్రి దంపతులు వడ్డించారు.
తరువాత రూ.10లు ఇచ్చి రెండు టోకెన్లు సీఎం చంద్రబాబు తీసుకోబోయారు. నేడు అన్నక్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అని టోకెన్ నిర్వహకుడు చెప్పాడు. అనంతరం లబ్ధిదారులతో కలిసి అల్ఫాహారాన్ని సీఎం చంద్రబాబు దంపతులు తీసుకున్నారు. సోమవారం మంత్రి చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నక్యాంటీన్ల ఒక రోజు ఖర్చు రూ.76 లక్షల విరాళం నారా భువనేశ్వరి అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో సోమవారం ఉచితంగా అన్నదానం చేశారు.