క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఆయన కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. సాక్ష్యాధారాలను తారుమారు చేసి దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు, బుధవారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.మాజీ మంత్రి అరెస్టు వార్తతో ఆయన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రభాస్ స్పిరిట్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గెస్ట్ రోల్?
ఇటీవల పలాస ప్రాంతంలో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదంలో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందారు. ఈ ఘటనలో మాజీ మంత్రి కుమారుడు ఆరవ్ వర్మ ద్విచక్ర వాహనం నడిపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే ప్రమాదం అనంతరం ఆరవ్ వర్మ స్థానంలో సిద్ధార్థ త్యాడి అనే యువకుడిని నిందితుడిగా చూపించి పోలీసుల ఎదుట లొంగిపోయేలా ప్రయత్నించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.దర్యాప్తు సందర్భంగా సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాల ఆధారంగా అసలు విషయాలు వెలుగులోకి రావడంతో ఆరవ్ వర్మ, సిద్ధార్థ త్యాడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం సాక్ష్యాలను తారుమారు చేయడం, నిందితుడిని తప్పించేందుకు కుట్ర పన్నడం వంటి ఆరోపణలపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.ఈ కేసులో విధుల్లో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో కాశీబుగ్గ సీఐ వై. రామకృష్ణ, ఎస్ఐ ఎం. సునీల్‌లపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇద్దరినీ వేకెన్సీ రిజర్వ్‌కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
అనంత్‌నాగ్‌లో ఉగ్రదాడి.. సీసీటీవీలో రికార్డైన కాల్పుల దృశ్యాలు
అరెస్టు సందర్భంగా ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. అయితే చట్టం ముందు అందరూ సమానమేనని, దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకే చర్యలు తీసుకున్నామని పోలీసులు స్పష్టం చేశారు. అరెస్టు నుంచి ఉపశమనం పొందేందుకు మాజీ మంత్రి కోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు ఊరట లభించలేదు.