క్రైమ్ మిర్రర్, సినిమా :- తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ నటించిన చివరి చిత్రంగా ప్రచారం పొందుతున్న జన నాయగన్ విడుదలకు సిద్ధమైంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదలకు ముందు ఇప్పుడు సోషల్ మీడియాలో మరో అంశం హాట్ టాపిక్‌గా మారింది. అదే విజయ్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్న భారీ పారితోషికం.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం, జన నాయగన్ కోసం విజయ్ రూ.220 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ మొత్తం నిజమైతే భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా విజయ్ కొత్త రికార్డు నెలకొల్పినట్లవుతుంది.
కుమారుడి హిట్ అండ్ రన్ కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్..!
ఇదే సమయంలో సినిమా మొత్తం బడ్జెట్ సుమారు రూ.400 కోట్లుగా ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ లెక్కల ప్రకారం విజయ్ పారితోషికమే సినిమా బడ్జెట్‌లో సగానికి పైగా ఉంటుందని చర్చ జరుగుతోంది. అయితే ఈ సంఖ్యలన్నీ అధికారికంగా ధృవీకరించబడలేదు.ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించిన బాబీ డియోల్‌కు సుమారు రూ.8 కోట్లు, హీరోయిన్ పూజా హెగ్డేకు రూ.6 కోట్లు, ప్రకాశ్ రాజ్‌కు రూ.5 కోట్లు పారితోషికంగా అందినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే ప్రియమణి, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నరేన్ తదితర నటీనటులకు కూడా భారీ మొత్తాలు చెల్లించినట్లు ప్రచారం ఉంది.దర్శకుడు హెచ్. వినోద్‌కు సుమారు రూ.25 కోట్లు, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌కు రూ.13 కోట్లు పారితోషికంగా ఇచ్చినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వివరాలపై కూడా అధికారిక ధృవీకరణ లేదు.
పగతోనే రౌడీ షీటర్ హత్య.. 24 గంటల్లో ముగ్గురు అరెస్ట్
కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పలు వాయిదాల అనంతరం జూలై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి.