తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూర్య.. సినిమాల్లోకి తన ప్రవేశం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తన తల్లి తీసుకున్న అప్పును తీర్చాలనే ఉద్దేశంతోనే తాను సినీ రంగంలోకి అడుగుపెట్టినట్లు ఆయన తెలిపారు.
తన తల్లికి ఉన్న సుమారు రూ.25 వేల అప్పును తీర్చేందుకు సినిమాల్లోకి రావాల్సి వచ్చిందని సూర్య చెప్పినట్లు సమాచారం. వాస్తవానికి కెమెరా ముందుకు వచ్చి నటించాలని తాను ఎప్పుడూ అనుకోలేదని ఆయన వెల్లడించారు. అయితే పరిస్థితులు తనను చిత్ర పరిశ్రమ వైపు తీసుకొచ్చాయని పేర్కొన్నారు.
సినిమాల్లోకి రాకముందు సూర్య గార్మెంట్ ఫ్యాక్టరీలో ట్రైనీగా పనిచేశారు. అనంతరం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి మంచి ఆదాయాన్ని సంపాదించినట్లు తెలిపారు. ఆ సమయంలోనే నటుడిగా మారే అవకాశం తన జీవితాన్ని మరో మలుపు తిప్పిందని సూర్య పేర్కొన్నారు.
1997లో విడుదలైన ‘నెరుక్కు నెర్’ సినిమాతో సూర్య వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత విభిన్న కథలు, పాత్రలను ఎంచుకుంటూ తమిళంతో పాటు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు.
తల్లి అప్పు తీర్చాలనే ఒక చిన్న కారణంతో మొదలైన తన సినీ ప్రయాణం.. ఇంత పెద్ద స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో అనుభవాలు, కష్టాలు ఉన్నాయని సూర్య చెప్పిన మాటలు ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
also read: AIతో మానవ మేధస్సుకే ముప్పు.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
