క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. సొంత పార్టీ నాయకత్వంపై, ముఖ్యంగా పార్టీలోని ఒక కోటరీపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనను అనవసరంగా రెచ్చగొడితే వైసీపీకే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన గట్టిగా హెచ్చరించారు.దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో తనకు 40 ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వైసీపీ కోసం తాను ఎంతగానో పనిచేశానని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. అయితే, పార్టీలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన ఈ అన్యాయం గురించి ఇప్పటికే అధిష్టానానికి ఒక లేఖ ద్వారా స్పష్టంగా తెలియజేశానని ఆయన వెల్లడించారు.
పోలీసుల దౌర్జన్యం వెనుక సీఎం రేవంత్: ‘దుశ్శాసన సభ’గా మారిందంటూ KTR ఫైర్
తనను ‘నమ్మకద్రోహి’గా చిత్రీకరిస్తూ వైసీపీలోని కోటరీ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. తనను ఇలాగే టార్గెట్ చేసి రెచ్చగొడితే, పార్టీకి సంబంధించిన మరిన్ని కీలక విషయాలను బయటపెట్టాల్సి వస్తుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అదే జరిగితే అంతిమంగా పార్టీకే పెద్ద నష్టమని స్పష్టం చేశారు.ఇదే సమయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తనకున్న దూరాన్ని కూడా ఆయన బహిర్గతం చేశారు. గత రెండేళ్లుగా జగన్ నుంచి తనకు కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదని ఆయన చెప్పడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఈ పరిణామాలు వైసీపీలోని అంతర్గత విభేదాలను స్పష్టంగా తేటతెల్లం చేస్తున్నాయి.
మంచి నిద్రకు మాటే మంత్రం.. ప్రశాంత నిద్ర కోసం ఆరోగ్య చిట్కాలు!
