ప్రముఖ మలయాళీ గాయకుడు నిసార్ వయనాడ్ కన్నుమూశారు. ఆయన అసలు పేరు నిస్సార్ అరోత్ ఇబ్రహీం. దుబాయ్‌లోని ఓ ఆసుపత్రిలో సెప్టిసీమియా కారణంగా శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో యూఏఈలోని మలయాళీ కమ్యూనిటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
నిసార్ వయనాడ్ అజ్మాన్‌లో నిర్వహించాల్సిన ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఆ కార్యక్రమానికి కొన్ని గంటల ముందే ఆయన మృతి చెందడం అభిమానులను, నిర్వాహకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
గత నెలలో దుబాయ్‌కి వచ్చిన నిసార్.. అప్పటి నుంచి జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్‌ను పోలిన గాత్రంతో నిసార్ వయనాడ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పాటలకు యూఏఈలోని మలయాళీ సంగీతాభిమానుల్లో మంచి ఆదరణ లభించింది.
నిసార్ వయనాడ్ మృతిపై పలువురు సంగీత కళాకారులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన గాత్రం, సంగీత సేవలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు.
also read: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి
