Homeసినిమాస్పిరిట్‌లో గోపీచంద్.. ప్రభాస్ మూవీపై ఆసక్తికరమైన బజ్!

స్పిరిట్‌లో గోపీచంద్.. ప్రభాస్ మూవీపై ఆసక్తికరమైన బజ్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ యాక్షన్ మూవీ ‘స్పిరిట్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

గోపీచంద్ ‘స్పిరిట్‌’లో నటించనున్నారనే వార్తలపై ఇటీవల ఓ మీడియా సమావేశంలో సందీప్ రెడ్డి వంగాను ప్రశ్నించగా.. ఆయన చిరునవ్వుతో స్పందించినట్లు తెలుస్తోంది. అయితే గోపీచంద్‌ నటనపై దర్శకుడు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. సందీప్ వంగా స్పందించిన తీరు మాత్రం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చింది.

ప్రభాస్, గోపీచంద్ మధ్య ఉన్న స్నేహం కూడా ఈ ప్రచారానికి మరో కారణంగా నిలుస్తోంది. ప్రభాస్ సూచనతోనే సందీప్ రెడ్డి వంగా.. గోపీచంద్‌ను ఈ ప్రాజెక్ట్ కోసం సంప్రదించి ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ అంశంపై ‘స్పిరిట్’ చిత్రబృందం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

ప్రస్తుతం గోపీచంద్ పాత్ర ఎలా ఉండబోతోంది? ప్రభాస్ పాత్రతో ఆయనకు ఎలాంటి సంబంధం ఉంటుంది? అనే విషయాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. నిజంగానే గోపీచంద్ ఈ సినిమాలో భాగమైతే.. ప్రభాస్, గోపీచంద్‌లను ఒకే సినిమాలో చూడాలనుకునే అభిమానులకు ఇది ప్రత్యేక ట్రీట్‌గా మారే అవకాశం ఉంది.

also read: కోమటిరెడ్డి యూ టర్న్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు