Homeతెలంగాణకేబినెట్‌లోకి రాజగోపాల్‌రెడ్డి!?.. వెంకట్‌రెడ్డి విషయంలో ఇదే జరుగుతోంది.!

కేబినెట్‌లోకి రాజగోపాల్‌రెడ్డి!?.. వెంకట్‌రెడ్డి విషయంలో ఇదే జరుగుతోంది.!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పుడు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ పై రకరకాల చర్చ మొదలైంది. ప్రధానంగా క్యాబినెట్ లోకి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని తీసుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకు తగ్గట్టు పరిణామాలు మారుతుండడం విశేషం. ప్రస్తుతం క్యాబినెట్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయనను తప్పించి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ని తీసుకుంటారని పొలిటికల్ వర్గాల్లో ప్రారంభం అయింది.

  •   రాజగోపాల్ రెడ్డి హాజరు..

ఇటీవల నకిరేకల్ లో సీఎం రేవంత్ పర్యటించిన సంగతి తెలిసిందే. భారీ బహిరంగ సభకు ఎన్నడూ లేని విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కావడం హాట్ టాపిక్ అవుతోంది. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం సభలకు అస్సలు హాజరయ్యే వారు కాదు రాజగోపాల్ రెడ్డి. కానీ ఇప్పుడు మంత్రి పదవి పై సంకేతాలతోనే ఆయన హాజరైనట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్.. ప్రధానంగా అన్న వెంకట్ రెడ్డిని తప్పించి.. రాజగోపాల్ రెడ్డికి చాన్స్ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఒకవైపు సీఎం సభకు రాజగోపాల్ రెడ్డి హాజరుకాగా.. మంత్రిగా ఉన్న వెంకట్ రెడ్డి ముఖం చాటేసారు. ఈ పరిణామాలతోనే అందరికీ ఒక స్పష్టత వచ్చింది. క్యాబినెట్లోకి తప్పకుండా రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటారన్న టాక్ మొదలైంది.

  •  ఏఐసీసీలో ఛాన్స్.. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఏఐసీసీలో తీసుకుంటారని.. కీలక పదవి కట్టబెడతారన్న టాక్ పొలిటికల్ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉంచి.. రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకుంటే తప్పుడు సంకేతం వెళ్తుంది. ఆ ఇద్దరు సోదరులకు అవకాశం ఇస్తే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ నుంచి కూడా ఇదే డిమాండ్ వస్తుంది. ఇంకోవైపు ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఇంతవరకు ప్రాతినిధ్యం లేదు క్యాబినెట్లో.. సామాజిక సమీకరణలతో పాటు అన్ని జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకే ఈ పరిణామాల క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై వేటుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే తన సోదరుడి కోసం తన పదవిని వదులుకునేందుకు వెంకట్ రెడ్డి సిద్ధంగా లేరు. పైగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి వెళ్లారు. వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. మొత్తానికి అయితే తమ్ముడి కోసం అన్న పదవి త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు