క్రైమ్ మిర్రర్, సినిమా:- భారీ విజువల్స్, మైథలాజికల్ కథాంశంతో తెరకెక్కిన నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు రిషబ్ సాహ్నీ పోషించిన అఫ్గన్ సుల్తాన్ అబ్దాలీ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో తొలి తెలుగు సినిమాతోనే ఆయన అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.రిషబ్ సాహ్నీ ముంబైకు చెందిన నటుడు. సినీ రంగంలోకి రావడానికి ముందు మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం పలు వెబ్ సిరీస్‌లకు కాస్టింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఇండస్ట్రీలో అనుభవం సంపాదించారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో చిన్న చిన్న పాత్రల ద్వారా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
మెస్సీ డామినేషన్.. రికార్డ్ సృష్టించారు!
2021లో విడుదలైన ది ఎంపైర్ వెబ్ సిరీస్‌లో నటించిన రిషబ్‌కు మంచి గుర్తింపు లభించింది. ఆ సిరీస్‌లో ఆయన నటన దర్శకుల దృష్టిని ఆకర్షించడంతో, హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ఫైటర్ చిత్రంలో అవకాశం దక్కింది. ఆ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అలాగే కౌన్ బనేగా శిఖర్వాతీ, బెస్ట్ సెల్లర్, ఎకోస్ ఆఫ్ వాలర్ వంటి వెబ్ సిరీస్‌ల్లోనూ తన నటనతో మెప్పించారు.ఇప్పుడు నాగబంధం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రిషబ్ సాహ్నీ, అబ్దాలీ పాత్రలో భయానకమైన విలన్‌గా కనిపించారు. కఠినమైన హావభావాలు, బలమైన బాడీ లాంగ్వేజ్, కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆయన పాత్ర సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో రిషబ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. హీరో విరాట్ కర్ణతో పోటాపోటీగా నటించి, కథలో విలన్ పాత్రకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కామెంట్లు చేస్తున్నారు. తొలి తెలుగు చిత్రంతోనే టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న రిషబ్ సాహ్నీకి, భవిష్యత్తులో మరిన్ని తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
దుస్తుల్లో, సాక్సుల్లో నోట్ల కట్టలు…! అయోధ్య విరాళాల దోపిడి కేసులో కీలక ఆధారాలు