Homeరాజకీయంవిజయ్ సర్కార్‌పై కుట్రకు రూ. 180 కోట్లు!తమిళనాడు రాజకీయాల్లో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు

విజయ్ సర్కార్‌పై కుట్రకు రూ. 180 కోట్లు!తమిళనాడు రాజకీయాల్లో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు

క్రైమ్ మిర్రర్, రాజకీయం:- తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో భారీ కుట్ర కోణం బయటపడింది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరిగిన ప్రయత్నాలకు సంబంధించి పలు సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.అందుతున్న సమాచారం ప్రకారం, విజయ్ సర్కార్‌లోని 10 మందికి పైగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు పకడ్బందీగా ప్రణాళిక రచించారు. ఈ ఆపరేషన్ కోసం ఏకంగా ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ రూ. 180 కోట్ల వరకు నిధులను కేటాయించినట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.అయితే, ఈ భారీ ప్రలోభాలకు మరియు బెదిరింపులకు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా లొంగలేదని సమాచారం. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న పోలీసుల విచారణలో నిందితులు విస్తుపోయే నిజాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. “డీఎంకే (DMK) ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ, మరియు ఆయన తమ్ముడి నేతృత్వంలో రూ. 35 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాం” అని నిందితులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం ఈ పరిణామం తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై దర్యాప్తు మరింత ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

దుస్తుల్లో, సాక్సుల్లో నోట్ల కట్టలు…! అయోధ్య విరాళాల దోపిడి కేసులో కీల‌క ఆధారాలు

పాక్‌ ఉప ప్రధాని మనవడి దుశ్చర్య… విదేశీ మహిళపై గ్యాంగ్‌ రేప్‌…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు