-
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా నియామకం
-
ప్రస్తుతం ఎమ్మెల్సీగా మెగా బ్రదర్
-
మంత్రి పదవి కోసం ఎదురుచూపు
-
ఇంతలోనే ఈ కొత్త పదవి
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: మెగా బ్రదర్, జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మరో పదవి లభించింది. క్యాబినెట్ ర్యాంక్ తో కూడిన పదవిని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం, పచ్చదనాన్ని గణనీయంగా పెంచేందుకు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఈకోలాజికల్ ఎన్రిచ్మెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా నాగబాబును నియమించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే జీవో జారీ చేశారు.
రాజ్యసభ పదవి ఆశించినా…
Also Read:బిగ్ బాస్ టైటిల్ గెలిచినా ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు- పల్లవి ప్రశాంత్
ప్రస్తుతం జనసేన ఎమ్మెల్సీగా ఉన్నారు నాగబాబు. మొన్నటి ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. జనసేన తరఫున ప్రచారం చేశారు. కూటమి సమన్వయానికి కృషి చేశారు. కూటమి అధికారంలోకి రాగానే నాగబాబుకు పదవి ఖాయమని ప్రచారం నడిచింది. రాజ్యసభకు వెళ్లడం ద్వారా కేంద్ర రాజకీయాల వైపు ఆసక్తి చూపారు నాగబాబు. అయితే రాజ్యసభ ఎంపిక సమయంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ వివిధ సమీకరణల్లో ఆయనకు అవకాశం దక్కలేదు. అయితే ఎమ్మెల్సీ ని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు అప్పట్లో ప్రకటించారు. ఏడాదిన్నర కిందట ఎమ్మెల్సీ అయ్యారు కానీ.. ఇంతవరకు మంత్రిగా అవకాశం దక్కలేదు నాగబాబుకు. అయితే ఇప్పుడు క్యాబినెట్ ర్యాంకింగ్ తో కూడిన పదవి ఇవ్వడం మాత్రం విశేషం.
ఆ లక్ష్యంతోనే…
Also Read:35 ఏళ్లకే టాలీవుడ్ హీరోయిన్ మృతి… ! నెల రోజుల తర్వాత బయటపడ్డ విషాద వార్త…
అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అదే శాఖ పరిధిలోని ఈ నియామకం జరగడం.. నాగబాబును చైర్మన్గా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలోని మొత్తం విస్తీర్ణంలో అడవులు, చెట్ల శాతాన్ని 247 నాటికి 50 శాతానికి పెంచాలని ప్రతిష్టాత్మక లక్ష్యంతో ఏపీ గ్రీన్ సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ లక్ష్యసాధనలో భాగంగా జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీలు, రాష్ట్రస్థాయి కార్యకలాపాలను సమర్థవంతంగా సమన్వయం చేయడం, పర్యవేక్షించడం, నిర్వహించడంలో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అత్యంత కీలక పాత్ర పోషించనుంది. అటువంటి చైర్మన్ పోస్టులో నియమితులైన నాగేంద్రబాబుకు క్యాబినెట్ ర్యాంకింగ్ హోదా ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి నియమ నిబంధనలు, అధికారాలు ఈ హోదాకు అనుగుణంగా వర్తిస్తాయని జీవోలో పేర్కొన్నారు
