క్రైమ్ మిర్రర్, సినిమా:- పాన్-ఇండియా స్టార్ ‘డార్లింగ్’ ప్రభాస్ మరియు దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న రాబోయే పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ డేట్‌పై టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని డిసెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.OTT ఒప్పందం వల్లే తొందర?అంతేకాకుండా, సినిమాకు సంబంధించిన OTT హక్కుల ఒప్పందం మేరకు, ఈ ఏడాది చివరికల్లా (2026) చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలనే ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. దీని కారణంగా సినిమా షూటింగ్, మరియు పోస్ట్-ప్రొడక్షన్ పనులను మేకర్స్ చాలా వేగంగా జరుపుతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతానికి డిసెంబర్ 3న విడుదలయ్యే అవకాశం ఉన్నప్పటికీ, విడుదల తేదీపై త్వరలోనే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అప్పటి వరకు ప్రభాస్ అభిమానులు ఈ అప్‌డేట్ కోసం వేచి చూడాల్సిందే!
విజయ్ సర్కార్‌పై కుట్రకు రూ. 180 కోట్లు!తమిళనాడు రాజకీయాల్లో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు
గొంతు కోసి భార్య హత్య.. పూజ గదిలో దారుణం!