క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో వింత పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన గులాబీ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. ఎందుకు గాను ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఒకవైపు డిజిటల్ మీడియా, మరోవైపు సోషల్ మీడియా సామ్రాజ్యం తో ముట్టడిస్తోంది. అయితే అధికార కాంగ్రెస్ మాత్రం అందుకు భిన్నంగా వెళ్తోంది. మాస్ రాజకీయంతో ఆ పార్టీ ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ఆ రెండు పార్టీలు భిన్నమైన వైఖరితో ముందుకు వెళుతున్నాయి. అయితే డిజిటల్ తో పాటు సోషల్ మీడియాతో ముందుకు వెళుతున్న గులాబీ పార్టీ కంటే.. మాస్ ఇమేజ్తో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో చొచ్చుకు వెళ్తోంది.
ఆందోళనలకు దూరం…
Also Read:బంకిపుర్ ఎమ్మెల్యేగా ప్రశాంత్ కిషోర్ ప్రమాణ స్వీకారం.. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో పీకే కొత్త అధ్యాయం!
గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యవహార శైలిని గమనిస్తే.. కేవలం విలేకరుల సమావేశాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రత్యక్ష ఆందోళనలకు ఆయన దూరంగా ఉంటున్నారు. గులాబీ పార్టీ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన కంటెంట్ తో సంచలనం సృష్టిస్తోంది. యూట్యూబ్ ఛానల్లు, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ హ్యాండిల్స్, ఇన్ఫ్లుయెన్సర్లు నెట్వర్క్ ద్వారా.. డిజిటల్ నెట్వర్క్ ను సద్వినియోగం చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచే ప్రయత్నంలో గులాబీ పార్టీ ముందుంది.
ప్రతిపక్షానికి విరుద్ధంగా…
Also Read:ఆటో డ్రైవర్ ఇంట్లో రూ.3 కోట్ల నగదు.. తుపాకీ కోసం వెళ్లిన పోలీసులకు షాక్!
ప్రతిపక్షానికి విరుద్ధంగా అధికార కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది. ఆ పార్టీ వ్యూహం సాగుతోంది. డిజిటల్ స్పేస్ కంటే ప్రజల మధ్య ప్రతిపక్షంగా ఉండే సభలకు రేవంత్ ప్రాధాన్యమిస్తున్నారు. వారంలో రెండు మూడు బహిరంగ సభలు లేదా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. రేవంత్ ప్రసంగాలు కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా.. పొలిటికల్ మాస్ డైలాగులు.. వైరల్ స్టేట్మెంట్లతో గులాబీ పార్టీని ఎండగడుతున్నారు.
అధికార పార్టీకి లోటు…
Also Read:ఝార్ఖండ్ విద్యార్థుల ఆందోళనపై రాహుల్ గాంధీ స్పందన.. సీఎం సోరెన్‌కు కీలక సూచనలు
అయితే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బలమైన సోషల్ మీడియా లేకపోవడం మాత్రం లోటు. డిజిటల్ మీడియాలో వచ్చే విమర్శలను తిప్పికొట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ సరైన ప్రభావం చూపలేకపోతోంది. అయితే రేవంత్ క్షేత్రస్థాయిలో తన సుడిగాలి పర్యటనల ద్వారా.. మాస్ ప్రసంగాలతో ఆ లోటును కొంత భర్తీ చేస్తున్నారు. రేవంత్ వ్యూహానికి తోడు బలమైన డిజిటల్ మీడియాను ఏర్పాటు చేస్తే తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదు.
