Homeక్రైమ్ముంబై పోలీసుల‌మంటూ వృద్దుడికి సైబ‌ర్ నేర‌గాళ్ల భారీ టోక‌రా...!

ముంబై పోలీసుల‌మంటూ వృద్దుడికి సైబ‌ర్ నేర‌గాళ్ల భారీ టోక‌రా…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: ముంబై పోలీసు అధికార‌ల‌మంటూ వృద్దుడిని బెదిరించి సైబ‌ర్ నేర‌గాళ్లు రూ. ల‌క్ష‌ల్లో దండుకున్న సంఘ‌ట‌న న‌గ‌రంలో చోటు చేసుకుంది. షేక్ బ‌సీర్‌బాద్‌కు చెందిన 72 ఏళ్ల వృద్దుడికి సైబ‌ర్ కేటుగాళ్లు ఫోన్ చేసి ఉగ్ర‌వాదుల‌కు నిధులు స‌మ‌కూర్చారంటూ బెదిరించి దారుణంగా మోసం చేశారు. రూ. 2కోట్లు ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు స‌మ‌కూర్చారంటూ బెదిరించారు.మ‌నీలాండ‌రింగ్ కేసు న‌మోదైంద‌ని బెదిరించారు.

 

వీడియోకాల్ చేసి ఓ సీనియ‌ర్ పోలీస్ అధికారినంటూ మ‌రోవ్య‌క్తిని వృద్దుడికి ప‌రిచ‌యం చేసి ఈ విష‌యం ఎవ‌రికైన చెబితే కుటుంబాన్ని కేసులో ఇరికిస్తామ‌ని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశారు. కేసు నుంచి త‌ప్పించేందుకు డ‌బ్బులు డిమాండ్ చేయ‌గా దానికి ఒప్పుకున్నాడు. వృద్దుడు భ‌యాందోళ‌న‌ల‌కు గురై విడ‌త‌ల వారిగా రూ.55.20ల‌క్ష‌లు కాజేశారు. చివ‌ర‌కు మోసాన్ని గ్ర‌హించిన వృద్దుడు సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్ర‌జ‌లు ఇలాంటి విష‌యాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మోస‌పోవ‌ద్ద‌ని సైబ‌ర్ క్రైమ్ పోలీసులు సూచించారు.

 

ఇవి కూడ చ‌ద‌వండి:

 

  1. పుణే హత్య కేసులో సంచలన విషయాలు.. మర్డర్ ప్లాన్ కోసం ChatGPT సాయం తీసుకున్న సియా గోయల్ 
  2.  సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 2006 నాటి కేసులో కీలక పరిణామం
  3. టీవీకే కీలక నిర్ణయం.. ఇండియా కూటమిలో విజయ్ పార్టీ చేరిక
  4.  అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి దుర్మరణం

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు