Homeజాతీయంర‌ష్యాలో క‌ల‌క‌లం....అంతుచిక్క‌ని వ్యాధితో ల్యాబ్ వ‌ర్క‌ర్ మృతి...!

ర‌ష్యాలో క‌ల‌క‌లం….అంతుచిక్క‌ని వ్యాధితో ల్యాబ్ వ‌ర్క‌ర్ మృతి…!

ఢిల్లీ, క్రైమ్‌మిర్ర‌ర్‌: క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డాలించిన విష‌యం తెలిసిందే. ర‌ష్యాలోని సైబీరియాలోని ఓ ల్యాబ్‌లో ప‌ని చేసే వ‌ర్క‌ర్ గుర్తు తెలియ‌ని వ్యాధితో మృతి చెంద‌డం ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం రేపింది. షెలెఖోవ్‌ ప్రాంతంలోని యాంటీ ప్లేగు పరిశోధన సంస్థలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్ర‌పంచానికి మ‌రేదైన ప్ర‌మాదం రాబోతుందా… ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. అస‌లు ల్యాబ్‌వ‌ర్క‌ర్ ఎలా మృతి చెందాడు..ల్యాబ్ నుంచి మ‌రేదైన ప్ర‌మాద‌క‌ర వైర‌స్ బ‌య‌ట‌కు వ‌చ్చిందా…అస‌లు ఇన్‌ఫెక్ష‌న్ ఏంట‌ని విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. కాగా ల్యాబ్‌వ‌ర్క‌ర్ నిమోనియా వ్యౄదితో మృతి చెందిన‌ట్లు స‌మాచారం.

అయితే అప్ర‌మ‌త్త‌మైన ర‌ష్యా అంటువ్యాధుల నియంత్ర‌ణ సంస్థ ఇర్కుటుస్క్‌, పెలెకోవ్ ప్రాంతంలో ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని తెలిపింది. ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లు చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఇర్కుటుస్క్ గ‌వ‌ర్న‌ర్ సూచించారు. ఇదే విష‌యంపై ర‌ష్యా చీఫ్ స్టేట్ డాక్ట‌ర్‌తో స్థానిక అంటువ్యాధుల నియంత్ర‌ణ విభాగం స‌మావేశం నిర్వ‌హించి ఆ ప్రాంతంలోని ఓ వ్య‌క్తి ప్ర‌మాక‌ర‌మైన ఇన్‌ఫెక్ష‌న్‌తో భారిన‌ప‌డి మ‌ర‌ణించిన అనుమానాలు ఉన్న నేప‌థ్యం అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించిన‌ట్లు గ‌వ‌ర్న‌ర్ తెలిపారు.

మరోవైపు, షెలెకోవ్ ప్రాంతంలో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. ల్యాబ్ సమీపంలోని అల్యూమినియం ప్లాంట్‌లోని వర్కర్లు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు ఆదేశించారు. ల్యాబ్ వర్కర్‌కు చికిత్స అందించిన ఆసుపత్రిలోని సుమారు 200 మందిని వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నట్టు కూడా వెలుగులోకి వచ్చింది. ఓ స్థానిక ఆసుపత్రిలో క్వారంటైన్ నిబంధనలు కూడా అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో, స్థానికంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. వర్కర్‌ను బలితీసుకున్న వ్యాధి నిమోనిక్ ప్లేగ్ అయి ఉంటుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవి కూడ చ‌ద‌వండి:

 

  1. హైద‌రాబాద్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం…!
  2.  ఖైరతాబాద్ బరిలో టిడిపి…!
  3.  అమరావతికి మరో రైల్వే లైన్…!
  4.  జాన్వీ డీప్‌ఫేక్‌పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. సెలబ్రిటీల తీరుపై తీవ్ర విమర్శలు

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు