-
సుదీర్ఘ వివరణ ఇచ్చిన మంత్రి నారా లోకేష్
-
చర్చకు సిద్ధం కావాలని జగన్ కు సవాల్
-
మండలిలో మంత్రి అచ్చన్న వర్సెస్ బొత్స
-
పరస్పరం హాట్ కామెంట్స్
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. అసెంబ్లీకి వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. శాసనమండలికి మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. అయితే తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గానే సాగాయి. శాసనమండలిలో అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రభుత్వం పై చేసిన కామెంట్స్.. తరువాత మంత్రి కింజరాపు అచ్చం నాయుడు చేసిన ప్రకటనలు సెగలు పుట్టించాయి. ఆ ఇద్దరు నేతలు పరస్పరం దద్దమ్మ, ఎద్దు అంటూ సంబోధిస్తూ ఒక్కసారిగా చర్చను హీట్ పుట్టించారు. మండలితో పోల్చుకుంటే అసెంబ్లీలో మాత్రం ప్రశాంతమే.
నాలుగోసారి లోకేష్ సవాల్…
Also Read:బంకిపుర్ ఎమ్మెల్యేగా ప్రశాంత్ కిషోర్ ప్రమాణ స్వీకారం.. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో పీకే కొత్త అధ్యాయం!
ప్రధానంగా డీఎస్సీ 2025 అంశం అసెంబ్లీని కుదిపేస్తోంది. డీఎస్సీ 2025లో అక్రమాలు జరిగాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేపడుతోంది ఆ పార్టీ. కానీ చాలా పారదర్శకంగా డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. దానికి సంబంధించిన అన్ని అంశాలను ప్రజల ముందుంచి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. అయితే ఇప్పుడు అసెంబ్లీ వేదికగా కూడా అదే అంశంపై చర్చ నడిచింది. శాసనసభలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. శాసనమండలిలో మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు డీఎస్సీ 2025 పై ఆరోపణలు చేశారు.
ఎక్కడైనా చర్చకు సిద్ధం…
Also Read:అనసూయపై కేసు.. తగ్గేదేలే అంటున్న నటి! ‘నా మాటలకు కట్టుబడే ఉన్నా’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్
శాసనసభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. డీఎస్సీ 2025ను చాలా పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు. కానీ గొడ్డలి పార్టీ దానిపై విషయం నింపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో గొడ్డలి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మూడుసార్లు సవాల్ చేశానని.. చర్చకు రావాలని కోరానని.. ఇప్పుడు నాలుగోసారి సవాల్ చేస్తున్నానంటూ సభలో ప్రకటించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయుల భర్తీ చేపట్టిందని.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని గుర్తు చేశారు. తమ హయాంలో ఉత్తమ విద్య బోధనకు గాను ఉపాధ్యాయులను విదేశాలకు శిక్షణకు పంపించామని.. కానీ వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో వైన్ షాపుల ఎదుట ఉపాధ్యాయులను కాపలా పెట్టారని గుర్తు చేశారు. డీఎస్సీ అంటేనే ముందుగా తెలుగుదేశం పార్టీ గుర్తొస్తుందని.. మరో డీఎస్సీకి సిద్ధంగా ఉన్నట్లు కూడా లోకేష్ ప్రకటించారు. డీఎస్సీ 2025 పై ఎక్కడ అయినా చర్చించేందుకు సిద్ధం అని ప్రకటన చేశారు లోకేష్.
దద్దమ్మ, ఎద్దు కామెంట్స్…
Also Read: ఆరావళి ఎక్స్‌ప్రెస్‌లో హైడ్రామా.. రైల్వే సిబ్బందిపై బ్లేడ్‌తో మోడల్ దాడి!
మరోవైపు శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. 2025 డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. డబ్బులకు అమ్ముకున్నారని కూడా ఎద్దేవా చేశారు. దీనిపై మంత్రి అచ్చం నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐదేళ్లు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఏం చేశారని బొత్సను ప్రశ్నించారు. గొడ్డలి పార్టీ అధినేతను ఒప్పించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఒక దద్దమ్మల మిగిలారంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీనిపై బొత్స అదే స్థాయిలో స్పందించారు. తనను దద్దమ్మ అనడాన్ని తప్పుపట్టారు. ఎవరు దద్దమ్మ అన్న విషయం ప్రజలకు తెలుసును అన్నారు. ఎద్దులా పెరిగిపోవడం కాదు భాష వాడడం తెలుసుకోవాలంటూ సెటైర్ వేశారు. అయితే తొలి రోజు శాసనమండలిలో మాత్రం వాడి వేడి చర్చ నడిచింది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఇది పెద్దల సభ అని.. జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు.
