Homeక్రైమ్వరద బాధితులకు సాయం చేస్తుండగా విషాదం.. హెలికాప్టర్ నుంచి పడిన ప్యాకెట్‌తో వ్యక్తి మృతి

వరద బాధితులకు సాయం చేస్తుండగా విషాదం.. హెలికాప్టర్ నుంచి పడిన ప్యాకెట్‌తో వ్యక్తి మృతి

క్రైమ్ మిర్రర్ : వరద బాధితులకు సహాయక చర్యలు అందిస్తున్న సమయంలో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ నుంచి ఆహార పదార్థాల ప్యాకెట్లను కిందకు వదులుతుండగా.. ఓ ప్యాకెట్ వ్యక్తిపై పడటంతో అతడు మృతి చెందిన ఘటన బిహార్‌లోని సారణ్ జిల్లాలో చోటుచేసుకుంది. అమ్నౌర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పరశురాంపూర్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు సహాయక శిబిరాల వద్దకు చేరుకున్నారు. వారికి హెలికాప్టర్ ద్వారా ఆహార పదార్థాలను అందిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌ నుంచి జారవిడిచిన ఆహార ప్యాకెట్ 58 ఏళ్ల అనిల్ కుమార్ సింగ్‌పై పడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

గాలి ప్రభావంతో మహిళకు గాయాలు

ఇదే ప్రాంతంలో హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ప్రయాణించడంతో మరో ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ నుంచి వెలువడిన బలమైన గాలి కారణంగా ఇనుప రేకులు ఎగిరి ఓ మహిళను తాకాయి. దీంతో ఆమె గాయపడగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బిహార్‌లోని పలు ప్రాంతాలు ప్రస్తుతం వరదల ప్రభావంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సహాయక చర్యల్లో భాగంగా బాధితులకు ఆహారం, ఇతర అవసరమైన వస్తువులను అధికారులు అందిస్తున్నారు. అయితే సహాయక చర్యల సమయంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం విషాదాన్ని నింపింది.
also read: కడపలో అత్త దారుణ హత్య.. అల్లుడి ఆత్మహత్యాయత్నం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు