Homeక్రైమ్బాచుపల్లిలో హిట్ అండ్ రన్.. ఆయుర్వేద థెరపిస్ట్ మృతి

బాచుపల్లిలో హిట్ అండ్ రన్.. ఆయుర్వేద థెరపిస్ట్ మృతి

క్రైమ్ మిర్రర్ : హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఓ ఆయుర్వేద థెరపిస్ట్ దుర్మరణం చెందిన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కేరళకు చెందిన అనాస్ ఎం.ఎస్. (23) మృతి చెందాడు. అనాస్ నగరంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో థెరపిస్ట్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి తన స్నేహితుడు అశ్విన్‌తో కలిసి స్కూటీపై సరదాగా రైడ్‌కు బయలుదేరాడు. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ మీదుగా ప్రగతినగర్‌లోని ఓ హోటల్ వైపు వెళ్తుండగా.. మూడు కోతుల బొమ్మల చౌరస్తా వద్ద గుర్తుతెలియని ఆర్‌ఎంసీ వాహనం వారి స్కూటీని ఢీకొట్టింది.

దీంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఈ క్రమంలో అనాస్ తలపై నుంచి ఆర్‌ఎంసీ వాహనం వెనుక టైర్లు వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగినప్పటికీ వాహనాన్ని ఆపకుండా డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై అశ్విన్ ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్‌ను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
also read : దృశ్యం తరహాలో హత్యకు ప్లాన్.. భార్యకు చేసిన ఒక్క ఫోన్ కాల్‌తో పోలీసులకు చిక్కిన నిందితుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు