Homeక్రైమ్అమృతమ్మ అదృశ్యం కేసులో ట్విస్ట్.. దారుణ హత్యగా నిర్ధారణ

అమృతమ్మ అదృశ్యం కేసులో ట్విస్ట్.. దారుణ హత్యగా నిర్ధారణ

క్రైమ్ మిర్రర్ : అదృశ్యమైన ఓ మహిళ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుల్కచర్ల మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన గంధం అమృతమ్మ (34) అదృశ్యం కేసు చివరకు హత్య కేసుగా మారింది. సెప్టెంబర్ 18న అమృతమ్మ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో అమృతమ్మతో సన్నిహితంగా ఉండే మంగలి ఆనంద్‌పై పోలీసులకు అనుమానం వచ్చింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అమృతమ్మను హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

నగల వ్యవహారంలో వివాదం

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. నగలు తాకట్టు పెట్టే విషయంలో అమృతమ్మ, ఆనంద్ మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆనంద్ అమృతమ్మను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం మృతదేహాన్ని వెన్నచేడ్ అడవికి తీసుకెళ్లి నిప్పంటించినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహానికి సంబంధించిన అవశేషాలను దేవసూర్ సమీపంలోని నదిలో పడేసినట్లు చెప్పినట్లు పేర్కొన్నారు.

నదిలో అవశేషాల గుర్తింపు

నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మహిళకు సంబంధించిన మృతదేహ అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను నిర్ధారించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : వృద్ధ దంపతులను ఢీకొట్టిన కారు.. మహిళ అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు