– ఆధారాలతో సహా కేటీఆర్ ఆస్తులను బయటపెట్టిన సీఎం రేవంత్
– ఆత్మరక్షణలో గులాబీ పార్టీ
– ఎదురుదాడిలో సాహేతుకమైన ఆధారాలు లేక చేతులెత్తేసిన వైనం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :-
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అధికార, ప్రతిపక్షం మధ్య గట్టి యుద్ధమే జరుగుతోంది. ముఖ్యంగా ఆస్తుల యుద్ధం భారత రాష్ట్ర సమితిని ఆత్మరక్షణలో పెట్టింది అని చెప్పక తప్పదు. కేటీఆర్ కుటుంబానికి హైటెక్ సిటీ, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్టార్ హోటళ్లు, వాణిజ్య భవన సముదాయాలు, సర్వీస్ అపార్ట్మెంట్ల వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బహిర్గతం చేశారు. ఇది ఒకరకంగా గులాబీ పార్టీకి షాకింగ్ కలిగించే విషయమే. రేవంత్ బయట పెట్టిన వివరాలన్నీ రికార్డుల్లో ఉండడంతో అవి మావి కావు అని ఖండించే అవకాశం లేదు. చివరకు మాకు హోటల్లు ఉన్నమాట వాస్తవమే.. వ్యాపారం చేయడం తప్పా అని కేటీఆర్ స్వయంగా మీడియా ముందు ఒప్పుకోవాల్సి రావడం ద్వారా.. కాంగ్రెస్ వేసిన ట్రాప్ లో గులాబీ పార్టీ చిక్కుకుందని అర్థమైంది.
ప్రజల్లోకి బలంగా..
గులాబీ పార్టీ అగ్రనేతలపై వచ్చిన ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. దీంతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. అందుకే రివర్స్ ఎటాక్ ప్రారంభించింది. కానీ అనుకున్న స్థాయిలో ఇది లేదు. రేవంత్ కుటుంబం పై రివర్స్లో వేలకోట్ల అవినీతి ఆరోపణలు గుప్పిస్తే సరిపోతుందన్న భ్రమలో గులాబీ పార్టీ అధికార ప్రతినిధులు హడావిడి చేశారు. అయితే ఒక్క విషయాన్ని గ్రహించాలి. కేటీఆర్ పై రేవంత్ ఏవేవో ఆరోపణలు చేయలేదు. రికార్డులు ఆధారంగానే చూసుకొని ఆరోపణలు చేశారు. దానికి పూర్తి విరుద్ధంగా గులాబీ పార్టీ మాత్రం ఎవరో వ్యాపారవేత్తలు, మహిళల పేర్లను తెరపైకి తెచ్చి వీరంతా రేవంత్ రెడ్డికి బినామీలు అంటూ చేస్తున్న ప్రచారానికి అంత ప్రాధాన్యత లభించడం లేదు..
అనేక అంశాలను ముడి పెడుతూ..
ప్రస్తుతం రేవంత్ కు ముడిపెట్టి అనేక రకాల ఆరోపణలు చేస్తోంది గులాబీ పార్టీ. ముఖ్యంగా మిడి కవర్ హాస్పిటల్స్ కొనుగోలు, విక్రయాల వ్యవహారాన్ని రేవంత్ కు ముడి పెట్టే ప్రయత్నం గులాబీ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. కానీ అనుకున్న స్థాయిలో దానిని ప్రదర్శించలేకపోయింది. మెడికవర్, సహృదయ సంస్థలు గత పదివేల టిఆర్ఎస్ హయాంలో హైదరాబాదులో విశేషంగా విస్తరించాయి.. కార్పొరేట్ స్థాయికి ఎదిగాయి. అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ కంపెనీలు తమ వాటాలు మార్చుకోవడం, హాస్పిటల్ చైన్లను విక్రయించడం వంటి సాధారణ వ్యాపార లావాదేవీలను.. రేవంత్ రెడ్డి బినామీ పెట్టుబడులుగా చిత్రీకరిస్తే ప్రజలు నమ్మడం కష్టం.
విశ్వసనీయత ఉంటేనే..
రాజకీయాల్లో పరస్పర ఆరోపణలు సహజం. కానీ అలా చేసే ఆరోపణలకు విశ్వసనీయత ఉండాలి. అలా ఉండాలంటే పక్కా ఆధారాలు తప్పనిసరి. కేటీఆర్ ఆస్తుల విషయంలో రేవంత్ రెడ్డి స్పష్టమైన వివరాలను ప్రజల ముందు ఉంచారు. రేవంత్ కుటుంబం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలో, గత రెండేళ్లలో అక్రమ సంపాదనకు నిర్దిష్టమైన ఆస్తుల వివరాలను గులాబీ పార్టీ చూపించలేకపోయింది. ఎవరికో చెందిన వ్యాపారాలను బినామీలుగా ముడి పెడుతూ కేవలం ప్రెస్ మీట్ లకే పరిమితం అయింది.
