Homeతెలంగాణకేసీఆర్ కోటలో!

కేసీఆర్ కోటలో!

– ఇక ఫామ్ హౌస్ లో సర్వే!
– తెలంగాణలో మరో సంచలనం
– ఇప్పటివరకు బయట సాగిన దర్యాప్తు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో
:-
కెసిఆర్ ఫామ్ హౌస్ పై విచారణ మరింత లోతుగా సాగుతోంది. మొదటి దశకు సంబంధించి విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు ఫామ్ హౌస్ బయట ప్రాంతాల్లోనూ, వెలుపల రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసింది. రెండో దశలో భాగంగా ఫామ్ హౌస్ కాంపౌండ్ వాల్ దాటి సర్వే చేయాలని భావిస్తోంది. అదే జరిగితే సంచలనాలు నమోదు కావడం ఖాయం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ పరిధిలో సుమారు 388 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములు కలిసిపోయాయంటూ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ చేసిన ప్రకటన ప్రకంపనలు రేపింది. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లా అదనపు కలెక్టర్, గజ్వేల్ ఆర్డీవో, సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ప్రత్యేక అధికారుల బృందాలు.. క్షేత్రస్థాయి పరిశీలనను ముమ్మరం చేశాయి. పరిసర ప్రాంతాల్లో మొదటి దశ సర్వేను దాదాపు పూర్తి చేశాయి.

సీఎం ఆదేశాలతో..
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారుల బృందం రంగంలోకి దిగింది. సర్వే నంబర్ 325 పరిధిలోని ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్, వరద రాజ్ పూర్ సరిహద్దుల్లోని భూములను అధికారులు ప్రధానంగా పరిశీలించారు. ఇందులో ప్రభుత్వ భూమి ఎంత? అసైన్డ్ భూమి ఎంత? పట్టా భూమి ఎంత? అనే లెక్కలను తేల్చేందుకు పాత రికార్డులు, తహసిల్దార్ కార్యాలయంలో ఫైళ్లను బయటకు తీశారు. క్షేత్రస్థాయిలో వాస్తవ సరిహద్దులను గుర్తించడానికి రెవెన్యూ సిబ్బంది కేవలం పాత రికార్డులకే పరిమితం కాలేదు. రోవర్లు, డ్రోన్లు, పాత సాటిలైట్ మ్యాప్ లను ఉపయోగించి గూగుల్ ఎర్త్ ఆధారంగా భూమి స్వరూపం గతంలో ఎలా ఉంది? ఇప్పుడు ఎలా మారిందనే అంశాలపై సాంకేతిక నిర్ధారణ కూడా చేసుకుంటున్నారు.

కాంపౌండ్ వాల్ దాటి..
ప్రస్తుతం ఫామ్ హౌస్ బయట, పరిసరాల్లో ప్రభుత్వ భూములు, సరిహద్దు ల గుర్తింపు మాత్రమే పూర్తి చేశారు తప్ప.. నేరుగా కెసిఆర్ ఫామ్ హౌస్ కాంపౌండ్ లోపలికి వెళ్లి సర్వే చేయలేదు. తొలి దశలో సేకరించిన ప్రాథమిక వివరాలు, సరిహద్దు కొలతలతో కూడిన నివేదికను అధికారులు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. సర్వే నంబర్ 325 పరిధిలోని ప్రభుత్వ భూమి హద్దులు, ఫామ్ హౌస్ ప్రహరీ లోపలికి విస్తరించి ఉన్నాయా? లేదా? అన్నది తేల్చేందుకు రెండో దశలో నేరుగా ఫామ్ హౌస్ లోకి ప్రవేశించి సర్వే చేయనున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు