Homeఆంధ్ర ప్రదేశ్కడప ఎంపీ చుట్టూ ఉచ్చు...!

కడప ఎంపీ చుట్టూ ఉచ్చు…!

  • వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈడి నోటీసులు

  • రూ.40 కోట్ల సుపారీ చుట్టూ విచారణ

  • ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేతికి కీలక ఆధారాలు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక మలుపు. ఈ కేసులో మనీ ల్యాండరింగ్ కోణంపై పూర్తిగా దృష్టి పెట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. హత్య సుపారీకి 40 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అనుమానిస్తోంది.

ఇప్పటివరకు ప్రధాన నిందితులను విచారణ చేపట్టిన ఈ డి.. ఇప్పుడు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ దారుణ హత్య వెనుక భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ జరిగినట్లు భావిస్తోంది ఈడి.

అందుకే విచారణకు హాజరు కావాలంటూ అవినాష్ రెడ్డిని తాజాగా పీఎంఎల్ఏ చట్టం కింద నోటీసులు జారీచేసింది. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఏకంగా 40 కోట్ల రూపాయల సుపారి డీల్ కుదిరిందనే సంచలన కోణాన్ని దర్యాప్తు సంస్థలు వెలికితీసాయి. ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక మూలాలు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి.

  • తేలని సిబిఐ విచారణ..

2019 మార్చి 15న వివేకానంద రెడ్డి హత్య జరిగింది. అప్పటినుంచి ఈ కేసు అలాగే కొనసాగుతూ వస్తోంది. అప్పట్లో వైసీపీ ప్రతిపక్షంలో ఉండేది. ప్రారంభంలో దీనిని గుండెపోటుగా చిత్రీకరించారు. తరువాత హత్యగా భావించి కేసు నమోదు చేశారు. అప్పట్లో టిడిపి ప్రభుత్వం కేసును సిఐడి విచారణకు అప్పగిస్తే.. జగన్మోహన్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

సిబిఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు సిపిఐ విచారణకు అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇంతలో వివేక కుమార్తె సునీత రంగంలోకి దిగారు. న్యాయపోరాటం ప్రారంభించారు. మళ్లీ సిబిఐ దర్యాప్తు మొదలయింది కోర్టు ఆదేశాలతో.

వైసిపి హయాంలో సిబిఐ విచారణకు సరైన సహకారం అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి. సిబిఐ కూడా విచారణలో చేతులెత్తేసింది. అప్పట్లో రుజువులను చెరిపేసారని.. ఇంతటితో దర్యాప్తు ముగిస్తున్నట్లు కోర్టుకు చెప్పింది. కానీ వైయస్ సునీత మాత్రం అసలు సూత్రధారుల విచారణ జరగలేదని చెప్పి కోర్టులను ఆశ్రయిస్తూనే ఉన్నారు.

  • అందుకే రంగంలోకి ఈడి..

మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది. రాజకీయ లబ్ధి కోసమే ఈ హత్య జరిగిందని.. ఈ హత్య కోసం 40 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చారని.. అది ఎవరు సమకూర్చారు అనే కోణంలో ఈడి దర్యాప్తు మొదలు పెట్టింది. కేసులో కీలక నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఎర్రి గంగిరెడ్డి ల విచారణ పూర్తయింది.

అయితే ఇప్పుడు వైయస్ అవినాష్ రెడ్డి తో పాటు ఆయన తండ్రికి ఈడీ నోటీసులు అందించడం విశేషం. ఈ సుపారి ఒప్పందంలో భాగంగా చేతులు మారిన భారీ నగదు రూటింగ్ క్రమంగా ఎంపీ అవినాష్ రెడ్డి తో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వైపే వేళ్ళు చూపిస్తున్నాయి. వీటికి సంబంధించి ఈ డి ప్రాథమిక ఆధారాలు కూడా సేకరించినట్లు తెలుస్తోంది.

  • ఆర్థిక కోణంలో..

ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్ గా మారారు ప్రధాన నిందితుల్లో ఒకడైన దస్తగిరి. అలాగే సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి బ్యాంకు ఖాతాల లావాదేవీలను నిశితంగా పరిశీలించింది ఈడి. హత్యకు ముందు, ఆ తరువాత జరిగిన కోట్లాది రూపాయల నగదు బదిలీల మూలాలు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిల కనుసన్నల్లోనే సాగాయని స్పష్టం చేస్తోంది.

నిందితులకు అందిన అడ్వాన్స్ సొమ్ము నుంచి మిగిలిన సుపారి నిధుల వరకు ప్రవాహం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనేది ఈడి దర్యాప్తులో ప్రధాన అంశంగా మారింది. అయితే ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు అందడం సంచలనంగా మారింది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు