HomeUncategorizedఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరూ...!

ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరూ…!

  • పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య కు ఛాన్స్

  • మరోవైపు సాధారణ అంగన్వాడి సంఘ నేత రమాదేవికి సైతం

  • గవర్నర్ కోటా కింద చంద్రబాబు అనూహ్య ఎంపిక

 

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:ఏపీలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీల ఎంపిక ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. గత నెల 28న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పండుల రవీంద్రబాబు, జాకీయా ఖానం పదవీ విరమణ చేశారు. వారి స్థానంలో కొత్త వారి ఎంపిక జరగాల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో జాప్యం జరుగుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఇద్దరు పేర్లను సీఎం చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలకు పెద్దపీట వేస్తూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వర్ల రామయ్య, అతి సామాన్య అంగన్వాడి కార్యకర్త రమాదేవి పేరు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

సీనియర్ నేతగా…

Also Read:72 ఏళ్ల వయసులో మనవడితో కలిసి ఎల్‌బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన విజయవాడ వాసి

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా వర్ల రామయ్య ఉన్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. పార్టీ పరంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఇటీవల నియమితులయ్యారు వర్ల రామయ్య. సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఆయన మాజీ పోలీస్ అధికారి కూడా. చట్టపరమైన, రాజ్యాంగబద్ధమైన అంశాలపై మీడియా వేదికగా గట్టిగానే వాయిస్ వినిపిస్తూ వచ్చారు. ఐదేళ్ల వైసిపి పాలనలో ప్రతిపక్షాల అణచివేత పై, పోలీస్ వ్యవస్థ దుర్వినియోగంపై న్యాయ పోరాటాలు చేస్తూ.. గవర్నర్ కార్యాలయం తో పాటు ఎన్నికల కమిషన్కు నిరంతరం ఫిర్యాదులు చేస్తుండేవారు. గతంలో రాజ్యసభ ఆశావహుడిగా నిలిచారు. ఓసారి ఓడిపోతానని తెలిసినా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేశారు. అందుకే ఆయన సుదీర్ఘ సేవలను గుర్తించి చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

సాధారణ మహిళకు సైతం…

Also Read:ఆటో డ్రైవర్ ఇంట్లో రూ.3 కోట్ల నగదు.. తుపాకీ కోసం వెళ్లిన పోలీసులకు షాక్!

మరోవైపు అనంతపురం జిల్లాకు చెందిన అంగన్వాడి సంఘం నేత రమాదేవిని ఎమ్మెల్సీగా అనూహ్య ఎంపిక చేశారు సీఎం చంద్రబాబు. ఎలాంటి రాజకీయ, ఆర్థిక నేపథ్యం లేకపోయినా.. దశాబ్దాలుగా క్షేత్రస్థాయిలో మహిళల హక్కుల కోసం, అంగన్వాడి ప్రాజెక్టుల పురోగతి కోసం, పార్టీ సైనికురాలిగా ప్రజల్లో ఉంటూ ఆమె చేసిన సేవలకు ఈ పదవికి ఎంపిక అయ్యేలా చేశాయి. ఒక సామాన్య మహిళను మండలికి పంపించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు సరైన సంకేతాలు పంపాలని చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పదవుల రేసులో ఎంతోమంది దిగ్గజాలు ఉన్నప్పటికీ.. ఒక సామాన్య మహిళా నేతకు ఈ అవకాశం ఇవ్వడం ద్వారా సరికొత్త ఒరవడి సృష్టించాలన్నది చంద్రబాబు ఆలోచన. దీనిపై అభినందనలు వెలువెత్తుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు