Homeజాతీయంబంకిపుర్ ఎమ్మెల్యేగా ప్రశాంత్ కిషోర్ ప్రమాణ స్వీకారం.. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో పీకే కొత్త అధ్యాయం!

బంకిపుర్ ఎమ్మెల్యేగా ప్రశాంత్ కిషోర్ ప్రమాణ స్వీకారం.. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో పీకే కొత్త అధ్యాయం!

జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లో మరో కీలక అడుగు వేశారు. బీహార్‌లోని బంకిపుర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ కుమార్ తన ఛాంబర్‌లో ప్రశాంత్ కిషోర్‌తో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో జన సురాజ్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ సమావేశాలు లేని కారణంగా స్పీకర్ ఛాంబర్‌లోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాకాల సమావేశాలు పూర్తవగా.. శీతాకాల సమావేశాలు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రమాణ స్వీకారంతో ప్రశాంత్ కిషోర్ అధికారికంగా అసెంబ్లీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు.

భారీ మెజార్టీతో విజయం

జులై 30న జరిగిన బంకిపుర్ ఉపఎన్నికలో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 19,246 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికలో ఆర్జేడీ అభ్యర్థి మూడో స్థానంలో నిలవడంతో పాటు డిపాజిట్ కూడా కోల్పోయారు.

హామీల అమలుపై ఫోకస్

ఎన్నికల విజయానంతరం తన నియోజకవర్గంలో తక్కువ సమయంలోనే మార్పు తీసుకొస్తానని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పన, విద్య, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై దృష్టి సారిస్తామని తెలిపారు.

బంకిపుర్‌లోని 10 వేల మంది యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం, విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యకు అవకాశాలు కల్పించడం, రేషన్ కార్డుల వ్యవస్థను మెరుగుపరచడం, 60 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ.1,100 పింఛను అందించేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ఆయన గతంలో ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విస్తరణ

బంకిపుర్‌కు మాత్రమే పరిమితం కాకుండా జన సురాజ్ పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసే దిశగా ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికల్లోనూ పార్టీ ప్రభావాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

త్వరలోనే ప్రశాంత్ కిషోర్ మరోసారి బీహార్‌లో విస్తృతంగా పర్యటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బంకిపుర్ ఎమ్మెల్యేగా తన హామీల అమలుతో పాటు జన సురాజ్ పార్టీ విస్తరణపై పీకే ఎలా ముందుకు సాగుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

also read: ఝార్ఖండ్ విద్యార్థుల ఆందోళనపై రాహుల్ గాంధీ స్పందన.. సీఎం సోరెన్‌కు కీలక సూచనలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు