విశాఖపట్నం, క్రైమ్ మిర్రర్ : ప్రపంచంలో నెంబర్ 1 టెక్నాలజీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు మరో చరిత్ర అని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఎన్నో కార్యక్రమాలకు వెళ్లాను కానీ… యూనివర్సిటీలో మీ ఉత్సాహం చూస్తుంటే మీ ఆనందం ఆకాశాన్ని తాకుతోంది.
విద్యార్థులు, పూర్వ విద్యార్థులకు అభినందనలు తెలుపుతున్నాను. 100 ఏళ్ల ఏయూ పండుగ ఒక చరిత్ర అని అన్నారు. ఆర్థిక సంస్కరణలు వచ్చాక 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నారంటే అది విశాఖ గొప్పతనం. గూగుల్ కంటే ముందుగానే ఏయూ ప్రపంచాన్ని విశాఖతో కనెక్ట్ చేసింది. 57 దేశాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారంటే రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం. విశాఖ విశ్వనగరం… గ్లోబల్ సిటీ. ఇది అన్ స్టాపబుల్. ఎవరూ ఆపలేరు. 100 ఏళ్ల చరిత్ర ఒక బ్రాండ్. రాష్ట్ర విభజన తర్వాత కేబినెట్ సమావేశం ఏయూలో నిర్వహించాం.
అది ఏయూ ప్రత్యేకత. 3 యూనివర్సిటీలో రాష్ట్రంలో ఉన్నాయి… అన్నింటికీ ఏయూ దిక్సూచి, లీడర్. స్వాతంత్ర్య పోరాటం కంటే ముందే ఈ యూనివర్సిటీ వచ్చింది. జైపూర్ రాజ్ విక్రమ దేవ్, గజపతి రాజవంశం, పిఠాపురం రాజవంశం, బొబ్బిలి రాజులు ఈ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేశారు. వారిని మనం స్మరించుకోవడం ధర్మం, బాధ్యత. కట్టమంచి రామలింగారెడ్డి ఏయూకు మొదటి వీసీగా చేసి బలమైన పునాది వేశారు. ఆయన కూడా చిత్తూరు జిల్లా ఆయన అన్నారు.
2వ వీసీ సర్వేపల్లి రాధాకృష్ణ… దేశ రాష్ట్రపతి అయ్యారన్నారు.నాకు 76 ఏళ్లయినా.. నేను 26 ఏళ్ల వ్యక్తిగానే ఆలోచిస్తాను. ఒకప్పుడు ఐటీతో ప్రారంభించాం… హైటెక్ సిటీ కట్టాం. నాలెడ్జ్ ఎకానమీకీ దోహదం చేశాం. నేడు డేటా సెంటర్, ఏఐ, క్వాంటం తీసుకొచ్చామని అన్నారు.