Homeక్రైమ్Shocking Divorce Case: చెల్లిని రెండో భార్యగా చూపి విడాకులు, కోర్టుకే షాకిచ్చిన కిలేడీ!

Shocking Divorce Case: చెల్లిని రెండో భార్యగా చూపి విడాకులు, కోర్టుకే షాకిచ్చిన కిలేడీ!

Fake Evidence in Divorce Case: ఒక మహిళ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించి విడాకులు పొందిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. తన భర్త మరో పెళ్లి చేసుకున్నాడని చూపించేందుకు, అతడి సొంత చెల్లిని రెండో భార్యగా చూపిస్తూ సాక్ష్యాలు సమర్పించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన భర్త, ఆ తీర్పును సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు.

అసలేం జరిగిందంటే?

గ్వాలియర్‌కు చెందిన ఈ దంపతులు 1998లో వివాహం చేసుకున్నారు. భర్త ఉద్యోగ కారణాల వల్ల తరచూ ఇంటికి దూరంగా ఉండాల్సి రావడంతో, ఇద్దరి మధ్య క్రమంగా విభేదాలు పెరిగాయి. 2015 నుంచి వారు వేర్వేరుగా జీవించడం ప్రారంభించారు. ఈ సమయంలో మహిళ పలుమార్లు విడాకులు కోరినా, భర్త అంగీకరించలేదని తెలుస్తోంది. 2021లో భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నాడని ఆరోపిస్తూ, దానికి సంబంధించిన ఆధారంగా ఒక ఫొటోను సమర్పించింది. ఆ ఫొటోలో భర్తతో పాటు అతని చెల్లి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ చిత్రాన్ని ఆధారంగా తీసుకున్న కోర్టు, భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని భావించి ఆమెకు విడాకులు మంజూరు చేసింది.

అసలు నిజం తెలియడంతో..

అయితే, ఇటీవల ఆ ఫొటో విషయంపై నిజం బయటపడింది. అందులో ఉన్న మహిళ భర్త చెల్లి అని తెలిసిన తర్వాత, తాను మోసపోయానని భావించిన భర్త వెంటనే హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు ముందు ఈ కేసు విచారణకు రానుంది. తప్పుదారి పట్టించే సాక్ష్యాలతో న్యాయస్థానాన్ని ప్రభావితం చేయడం ఎంత తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుందో ఈ కేసుతో తేలింది. ఆమెపై న్యాయస్థానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు