Homeజాతీయంప్రకాష్ రాజ్ చుట్టూ ఉచ్చు!

ప్రకాష్ రాజ్ చుట్టూ ఉచ్చు!

•ప్రశ్న రావణ్ వెనుక ఉన్నది ఆయనే
•పక్కా ఆధారాలు సేకరించిన ఏపీ పోలీసులు
•త్వరలో నోటీసులు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:-
ఏపీలో నటుడు ప్రకాష్ రాజ్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? కుల చిచ్చుపెట్టే కుట్రలో ఆయన భాగమా? పవన్ కళ్యాణ్ పై కోపంతో ఆయన తెరవెనుక పావులు కదుపుతున్నారా? ప్రశ్న రావణ్ వెనుక ఉన్నది ప్రకాష్ రాజ్ అని తేలిందా? అందుకు సంబంధించిన ఆధారాలు లభించాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.

పక్కా వ్యూహంతోనే..
ఏపీలో జోసెఫ్ రావణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకు ఆయన అరెస్టు జరిగిన తర్వాత ఐదు సార్లు బెయిల్ లభించింది. ఇలా బెయిల్ పై బయటకు వస్తున్న తరుణంలో మరో కేసు నమోదవుతోంది. మళ్లీ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే రావణ్ వెనుక ప్రకాష్ రాజ్ హస్తం ఉన్నట్లు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని, ముఖ్యంగా ఆయన సతీమణి టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలతో లైవ్ పెడతానని జోసెఫ్ రావణ్ రంకెలు వేశారు. ఈ వ్యవహారం వెనుక ప్రకాష్ రాజ్ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. హిందుత్వాన్ని, హిందూ దేవాలయాలను టార్గెట్ చేయడం దగ్గర్నుంచి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పై బురద జల్లడం వరకు అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న కుట్రగా పోలీసులు అనుమానిస్తున్నారు. దమ్ముంటే తనను అరెస్టు చేయాలంటూ జోసెఫ్ సవాల్ విసిరిన వీడియోలు వెనుక అసలు మాస్టర్ మైండ్ ప్రకాష్ రాజ్ అని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు ప్రచారం నడుస్తోంది.

చిక్కిన ఆడియో కాల్ సంభాషణ..
జోసెఫ్ రావణ్ అరెస్టులు వరుసగా జరుగుతున్నాయి. పోలీసులు ఆయనను వేరువేరు ప్రాంతాలకు తిప్పుతూ విచారిస్తున్నారు. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. అసలైన కుట్ర దారులను బయటకు లాగేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ అరెస్టుల పర్వం కొనసాగుతోందని అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంలో పోలీసుల అంచనాలు ఫలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జోసెఫ్ రావణ్, ప్రకాష్ రాజ్ మధ్య జరిగినట్లు చెబుతున్న ఒక రహస్య ఫోన్ కాల్ ఆడియో రికార్డింగ్ పోలీసుల చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కుల చిచ్చు పెట్టి, ఓటమి ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసేందుకు ప్రకాష్ రాజ్ కేంద్రంగా సోషల్ మీడియా వ్యూహాలు సిద్ధం చేశారు అనడానికి కొన్ని ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తోపాటు కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా టార్గెట్ చేయాలి? అరెస్టు జరిగితే ఎలా స్పందించాలి? అనే విషయాలపై ప్రకాష్ రాజ్ టీం జోసెఫ్ రావణ్ కు స్క్రిప్ట్ అందించినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ నినాదాలు తోనే ఆయనను తాజాగా టార్గెట్ చేసినట్లు అర్థం అవుతోంది. పరిస్థితులు చూస్తుంటే త్వరలోనే ఏపీ పోలీసులు ప్రకాష్ రాజుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరి కొన్ని సాంకేతిక ఆధారాలు సేకరించి ప్రకాష్ రాజ్ చుట్టూ ఉచ్చు బిగించాలన్నది ఆలోచనగా సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు