Homeఆంధ్ర ప్రదేశ్నేను మాట్లాడిన దాంట్లో ఏ తప్పూ లేదు: మాజీ మంత్రి అమర్‌నాథ్!

నేను మాట్లాడిన దాంట్లో ఏ తప్పూ లేదు: మాజీ మంత్రి అమర్‌నాథ్!

క్రైమ్ మిర్రర్,అమరావతి:- తాను చేసిన ‘మేకప్ మంత్రి’ కామెంట్లకు కట్టుబడి ఉన్నానని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో, బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన వివరణ ఇచ్చారు.”కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికే నేను అలా మాట్లాడాను. నేను మాట్లాడిన దాంట్లో ఏ తప్పూ లేదు. నా కామెంట్స్‌ను యావత్ మహిళా లోకానికి ఆపాదించవద్దు. నేను మంత్రి అనితను ఉద్దేశించి మాత్రమే అన్నాను,” అని అమర్‌నాథ్ స్పష్టం చేశారు.గతంలో వైసీపీ అధినేత జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతిపై అనిత అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మహిళా లోకం ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. “అప్పట్లో అనిత ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు ఏంచేశారు?” అని నిలదీశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ రంగు పులుముతున్నారని ఆయన ఆరోపించారు.

ఆల్ఫా’ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల‌…! జులై 3న గ్రాండ్ రిలీజ్‌

రోజంతా ఫోన్ ఛార్జ్ అయిపోతుందని టెన్షన్‌ పడుతున్నారా… ఈ సింపుల్ ట్రిక్స్‌తో బ్యాటరీ లైఫ్ డబుల్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు