Homeతెలంగాణబాగా చ‌దివి బ‌హుమ‌తి గెలువండి

బాగా చ‌దివి బ‌హుమ‌తి గెలువండి

 

  • స్టేట్ టాప‌ర్‌కు రూ.5ల‌క్ష‌లు
  • ప్ర‌తి జిల్లా టాప‌ర్‌కు రూ. 2ల‌క్ష‌లు
  • మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్‌

ధ‌ర్మ‌పురి,క్రైం మిర్ర‌ర్ః

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులు అత్యధిక మార్కులు సాధించి నగదు బహుతులు సాధించాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. ఈ సంద‌ర్భంగా

శ్రీరాం లైఫ్ ఇన్సూరెన్స్ వారు ప్రతిభవంతులైన విద్యార్థుల‌కు అందించే నగదు బహుమతి పోస్టర్ ను మంత్రి మంగళవారం ధర్మపురి పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.

శ్రీరామ్ లైఫ్ ఇన్యూరెన్స్ వారు ప్రభుత్వ పాఠశాలల్లో చదుతున్న 10 వ తరగతి విద్యార్ధులను ప్రోత్సాహించడానికి రూ. 2.2 కోట్ల నగదు బహుమతి అందిస్తున్నారని మంత్రి తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్ధులు నగదు బహుమతి సాధించే విధంగా ర్యాంకులు సాధించాలని మంత్రి విద్యార్ధులకు సూచించారు.

స్టేట్ టాప‌ర్‌కు రూ.5ల‌క్ష‌లు

రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ పొందిన విద్యార్ధికి రూ. 5 లక్షలు, రెండవ స్థానంలో నిలిచిన విద్యార్ధికి రూ. 3 లక్షలు, ప్రతి జిల్లా టాపర్ కు రూ. 2 లక్షలు అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు.

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని ప్రతి నియోజకవర్గ టాపర్ కు రూపాయలు లక్ష రాష్ట్రంలోని 612 మండలాల్లో ప్రధమ స్థానాన్ని పొందిన విద్యార్ధులకు రూ. 10 వేల చొప్పులన నగదు బహుమతి అందజేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు మంత్రి కి వివరించారు.

 

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు