Homeతెలంగాణతెలంగాణలో కాసేపట్లో వర్షాలు: పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక!

తెలంగాణలో కాసేపట్లో వర్షాలు: పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక!

క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. రాగల కొద్దిసేపట్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం 7:00 గంటల లోపు పలు ప్రాంతాల్లో వానలు పడే అవకాశం బలంగా ఉందని అధికారులు తెలిపారు.

వర్ష సూచన ఉన్న జిల్లాలు ఇవే:-

వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం కింది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

1.హైదరాబాద్
2.మేడ్చల్
3.మల్కాజ్‌గిరి
4.రంగారెడ్డి
5.వరంగల్
6.హనుమకొండ
7.జనగామ
8.యాదాద్రి
9.భువనగిరి
10.సిద్దిపేట
11.కరీంనగర్
12.ఖమ్మం
13.భద్రాద్రి కొత్తగూడెం
14.మహబూబాబాద్
15.నల్గొండ
16.సూర్యాపేట
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:- ఈ జిల్లాల పరిధిలోని ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ప్రయాణాలు చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు.

తమిళనాడులో రాజ్యాంగ వివాదం…! రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజీనామాను కోరిన విజయ్ సర్కార్ …

ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు