Homeజాతీయంతమిళనాడులో రాజ్యాంగ వివాదం...! రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజీనామాను కోరిన విజయ్ సర్కార్ ...

తమిళనాడులో రాజ్యాంగ వివాదం…! రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజీనామాను కోరిన విజయ్ సర్కార్ …

  • డీఎంకే హయాంలో నియమితులు కావడమే కారణం

  • కుదరదు అంటున్న రాజకీయ నిపుణులు

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: తమిళనాడులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు జోసఫ్ విజయ్. అప్పుడే రాజ్యాంగ వివాదం పెట్టుకున్నారు. రాజకీయ వివాదాలను తెచ్చుకుంటున్నారు, తాజాగా విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వివాదానికి దారితీసింది. స్వయం ప్రతిపత్తి కలిగిన అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జ్యోతి నిర్మల సామిని పదవికి రాజీనామా చేయాలని ప్రభుత్వం దేశించింది. డీఎంకే ప్రభుత్వ హయాంలో నియామకమైన వివిధ బోర్డులు, కార్పొరేషన్ల చైర్మన్లను తొలగించే క్రమంలో.. ఏకంగా ఎన్నికల కమిషనర్ను కూడా రాజీనామా చేయాలని ఒత్తిడి తేవడంపై తమిళ రాజకీయ, ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.

సీనియర్ అధికారిణి…

Also Read:మరో గుమ్మిడి నరసయ్య…!

జ్యోతి నిర్మల సామి రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి. 2024లో ఐదేళ్ల కాల పరిమితితో తమిళనాడు ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆమె పదవీకాలం 2029 మే వరకు ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం వార్డుల పునర్విభజన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న తమిళనాడు డి లిమిటేషన్ కమిషన్ చైర్పర్సన్ గా కూడా ఉన్నారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఈమె నేతృత్వంలో ఈవీఎంల ఏర్పాటు ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ సమయంలో విజయ్ సర్కార్ ఆమెను రాజీనామా చేయాలని ప్రతిపాదించడం చర్చనీయాంసంగా మారింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తును పూర్తి చేయాలనే పట్టుదలతో ఆమె ఉన్నారు.

అంత ఈజీ కాదు…

Also Read:ఇండియన్ రైల్వే… నాన్ స్టాప్…! సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌…

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను అంత సులువుగా తొలగించలేరు అనేది విశ్లేషకుల మాట. రాజ్యాంగ నిపుణులు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్ణయం పై. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను గవర్నర్ నియమించినప్పటికీ.. వారిని తొలగించడం మాత్రం అంత సులువు కాదు. హైకోర్టు న్యాయమూర్తిని ఏ విధంగానైతే తొలగిస్తారో.. అదే పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. సాధారణ ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్ల అధిపతులను మార్చినట్టుగా.. ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ అధిపతిని మార్చడం చట్ట విరుద్ధమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గతంలో డీఎంకే హయాంలో నియమితులైన మాజీ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా డీఎంకే అధికారం కోల్పోయిన వెంటనే తమ పదవులను వదులుకున్నారు కానీ… రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో మాత్రం అది జరగదు.

Also Read:ఇండియన్ రైల్వే… నాన్ స్టాప్…! సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌…

జ్యోతి నిర్మల సామి చాలా సిన్సియర్ అధికారిగా మంచి పేరు ఉంది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారన్న పేరు కూడా ఆమె సొంతం. 2008లో కన్యాకుమారి జిల్లాలో ఇసుక మాఫియా పై కఠిన చర్యలు తీసుకున్నందుకుగాను తమిళనాడు ప్రభుత్వం అత్యున్నత కల్పనా చావ్లా శౌర్య పురస్కారం అందుకున్న ఏకైక ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఈ వివాదంపై ప్రతిపక్ష డిఎంకె, ఇతర పార్టీలు విజయ్ ప్రభుత్వం పై మండిపడుతున్నాయి. స్వయం ప్రతిపత్తి గల సమస్యలను విజయ్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట నెలకొన్న ఈ హైడ్రామ.. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు