Homeతెలంగాణసీఎం రేవంత్ వ్యూహం...!గోశాలలతో హిందూ ఓటు బ్యాంక్ పై గురి...

సీఎం రేవంత్ వ్యూహం…!గోశాలలతో హిందూ ఓటు బ్యాంక్ పై గురి…

కరీంనగర్, క్రైమ్‌మిర్ర‌ర్‌:తెలంగాణ రాజకీయాల్లో సాంప్రదాయ కాంగ్రెస్ శైలికి భిన్నంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై ఉన్న మైనారిటీ అనుకూల ముద్రను పక్కనపెట్టి, తెలంగాణ సమాజంలో బలంగా ఉన్న హిందూ సెంటిమెంట్‌ను తన వైపు తిప్పుకునేందుకు ఆయన పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగమే ఇటీవల రేవంత్ రెడ్డి వేగవంతం చేసిన సాఫ్ట్ హిందూత్వ రాజకీయం. హిందూత్వ నినాదం, ఆ సెంటిమెంట్ పూర్తిగా భారతీయ జనతా పార్టీ కి అనుకూలంగా మారకుండా, రాష్ట్రంలోని హిందూ ఓటు బ్యాంకును కాపాడుకోవడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఈ నయా మార్క్ పాలిటిక్స్‌ను తెరపైకి తెచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ వ్యూహంలో అత్యంత కీలకమైన మైలురాయి.. నూతన సచివాలయ ప్రాంగణంలో ప్రతిష్టాత్మక నల్లపోచమ్మ ఆలయాన్ని అత్యంత వైభవంగా నిర్మించాలని నిర్ణయించడం, దానికి సంబంధించిన పనులను స్వయంగా పర్యవేక్షించడం.

Also Read:విషాదం: అంబులెన్స్ ఆలస్యంతో నలుగురు శిశువులు మృతి

గతంలో నిర్మించిన సచివాలయ ఆలయాల కంటే మిన్నగా, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఈ గుడిని తీర్చిదిద్దుతున్నారు. కేవలం నల్లపోచమ్మ ఆలయమే కాకుండా, సచివాలయంలోని శివాలయం, ఇతర అనుబంధ గుడుల పునర్నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తాము హిందూ ధర్మానికి బీజేపీ మాత్రమే హక్కుదారు కాదనే బలమైన సంకేతాన్ని పౌర సమాజంలోకి సీఎం రేవంత్ బలంగా పంపగలిగారు.హిందూ సమాజంలో అత్యంత పవిత్రంగా భావించే గోరక్షణపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో, ప్రభుత్వ సహకారంతో వేల సంఖ్యలో అత్యాధునిక గోశాలల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా అజెండా ఎమిటో తెలియచెప్పారు. దీనికి అదనంగా.. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన దేవాదాయ భూముల పరిరక్షణపై రేవంత్ రెడ్డి ప్రత్యేక నిఘా విభాగాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రముఖ ఆలయాలకు చెందిన వేలాది ఎకరాల భూములు కబ్జా కాకుండా డిజిటల్ మ్యాపింగ్ చేయించడం, వివాదాస్పద భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలకు శ్రీకారం చుట్టారు.

Also Read:జమ్మూకశ్మీర్ షోపియాన్‌లో ఎన్‌కౌంటర్: లష్కరే తోయిబా కమాండర్ జాకిర్ ఘనీ హతం

అలాగే, యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసి, తిరుమల తరహాలో అటానమస్ బోర్డును తీసుకురావాలని భావించడం వెనుక కూడా దేవాలయాల స్వయంప్రతిపత్తిని గౌరవిస్తామనే సందేశం దాగి ఉంది. భద్రాచలం, వేములవాడ, జోగులాంబ గద్వాల వంటి చారిత్రాత్మక ఆలయాల అభివృద్ధికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించడం రేవంత్ వ్యూహాత్మక పంథాకు అద్దం పడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 స్థానాలు గెలుచుకుని, ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకోవడమే రేవంత్ రెడ్డి ఈ రూట్ మార్చడానికి ప్రధాన కారణం. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ పరిసర జిల్లాల్లో హిందూ ఓటర్లు కాషాయం వైపు ఆకర్షితులవుతున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ఓటు బ్యాంక్ మరింతగా చేజారితే రాబోయే గ్రేటర్ హైదరాబాద్ , వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది.

Also Read:చైనాలో భారీ వరదలు: ఒక్క ఫామ్‌ ధ్వంసం- 900 పాములు మిస్సింగ్‌

అందుకే, బీజేపీ కేవలం మాటలతో హిందూత్వ రాజకీయం చేస్తుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం ప్రభుత్వ నిధులు, అధికారిక కార్యక్రమాల ద్వారా ‘చేతల హిందూత్వాన్ని’ ప్రదర్శిస్తూ కమలదళం ఆయుధాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఈ సాఫ్ట్ హిందూత్వ వ్యూహం కాంగ్రెస్‌కు రాజకీయంగా శ్రీరామరక్షగా మారుతుందా లేదా అనేది రాబోయే గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ల్చనున్నాయి. ఒకవైపు మైనారిటీ ఓటు బ్యాంకు దూరం కాకుండా చూసుకుంటూనే, మరోవైపు హిందూ సెంటిమెంట్‌ను గౌరవించడం అనేది కత్తిమీద సామే అయినప్పటికీ.. రేవంత్ రెడ్డి తన మార్క్ దూకుడుతో దాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. ఈ వ్యూహం గనుక క్షేత్రస్థాయిలో పక్కాగా వర్కవుట్ అయితే, తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అని భావిస్తున్న బీజేపీకి ఇది గట్టి ఎదురుదెబ్బే అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు