Homeఆంధ్ర ప్రదేశ్టేకాఫ్ కు భోగాపురం విమానాశ్ర‌యం రెడీ...!

టేకాఫ్ కు భోగాపురం విమానాశ్ర‌యం రెడీ…!

విజయనగరం , క్రైమ్‌మిర్ర‌ర్‌: ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేయబోతున్న ప్రతిష్టాత్మక ‘భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. విమానాశ్రయ నిర్మాణ పనులను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు మంగళవారం క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. విమానాశ్రయానికి సంబంధించిన ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, రన్‌వే మరియు ఎయిర్‌పోర్ట్‌ గ్రీనరీ పనులను ఆయన నిశితంగా వీక్షించారు.ఈ సందర్భంగా జీఎంఆర్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఉన్నతాధికారులు మంత్రికి ప్రాజెక్ట్ తుది మెరుగులకు సంబంధించిన పూర్తి వివరాలను మ్యాపుల ద్వారా వివరించారు. పనుల పరిశీలన అనంతరం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ అత్యంత కీలకమైన అప్‌డేట్‌ను ఇచ్చారు.

Also Read:India vs England 4th T20: డూ ఆర్ డై మ్యాచ్.. నాలుగో టీ20లో ఇంగ్లండ్‌కు టీమిండియా షాకిచ్చేనా?

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన సివిల్ మరియు సాంకేతిక పనులు 100 శాతం పూర్తయ్యాయని, విమానాల రాకపోకలుప్రారంభించడానికి ఎయిర్‌పోర్ట్ పూర్తిగా సిద్ధంగా ఉందని జీఎంఆర్ సంస్థ స్పష్టం చేసిందని తెలిపారుఅన్నింటికీ మించి, అత్యంత కీలకమైన విమానాశ్రయ నిర్వహణ లైసెన్స్ కూడా మంజూరైందని మంత్రి అధికారికంగా ప్రకటించారు. “భోగాపురంలో ఇంత అత్యద్భుతమైన విమానాశ్రయ భవనం వస్తుందని అసలు ఊహించలేదు” అని మంత్రి రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. సముద్ర తీర ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ విమానాశ్రయ టెర్మినల్‌ను ‘చేప ఆకారంలో’ ఎంతో ఆకర్షణీయంగా నిర్మించామని ఆయన వెల్లడించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆదేశాలు, కూటమి ప్రభుత్వ పక్కా ఎజెండా, మరియు అందరి సహకారంతో కేవలం రెండేళ్ల రికార్డు కాలంలోనే ఈ మెగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేయగలిగామని స్పష్టం చేశారు.

Also Read:NIA Raids: ఉగ్ర భావజాలంపై ఉక్కుపాదం.. ఏపీ, తెలంగాణతో పాటు 10 రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ మెరుపు దాడులు!

ఈ నిర్మాణానికి భూములిచ్చి పూర్తి సహకారం అందించిన స్థానిక రైతులు, ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ తేదీపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. విమానాశ్రయం అన్ని రకాలుగా సిద్ధమైనందున, ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరనున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ తన పర్యటన తేదీని ఖరారు చేయగానే భోగాపురం ఎయిర్‌పోర్టును అధికారికంగా లాంఛనంగా ప్రారంభిస్తామని వెల్లడించారు. రానున్న రోజుల్లో పెరగబోయే ప్రయాణికుల రద్దీ, ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌పోర్ట్ లోపల మరియు వెలుపల అన్ని రకాల అధునాతన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

Also Read:Colors Swathi Wedding: కలర్స్ స్వాతి రెండో పెళ్లి.. దర్శకుడితో ఏడడుగులు.. వెడ్డింగ్ ఫోటోలు వైరల్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు