అనంతపురం, క్రైమ్‌మిర్రర్: ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండి, కాన్పుల మధ్య కనీసం రెండేళ్ల విరామం పాటించిన దంపతులకు నగదు పురస్కారాలు అందించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జులై 11వ తేదీ నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు ర్వహించనున్నారు. ఇందులో భాగంగా ముగ్గురు పిల్లలున్న దంపతులను ప్రతి జిల్లాకు మూడు, అలాగే కాన్పుల మధ్య సరైన దూరం పాటించిన జంటలను ప్రతి జిల్లాకు ఆరు చొప్పున గుర్తించి రూ.5 వేల నగదు బహుమతి అందిస్తారు. ఒకవేళ అర్హులైన దంపతులు ఎక్కువగా ఉంటే లక్కీడిప్ ద్వారా విజేతలను ఎంపిక చేస్తామని, అలాగే ఉత్తమ సేవలందించిన డాక్టర్లు, వైద్య సిబ్బందికి కూడా పురస్కారాలు ఇస్తామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.
Also Read:ఓటీటీకి వచ్చేసిన ‘పెద్ది’: అదనపు సన్నివేశాలతో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
రాష్ట్ర ప్రభుత్వ ఈ నిర్ణయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో జనాభా పెరుగుదలపై చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా ఉందని చెప్పవచ్చు. గతంలో జనాభా నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు, ప్రస్తుత మారుతున్న పరిస్థితుల్లో తన వ్యూహాన్ని మార్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో యువత సంఖ్య తగ్గి, వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోందని (డెమోగ్రాఫిక్ డివిడెండ్ నష్టం) ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం అధికంగా వృద్ధుల జనాభాగా మారకుండా ఉండాలంటే దక్షిణ భారతదేశంలోని దంపతులు ఎక్కువ మంది పిల్లల్ని కనాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
జనాభా తగ్గుదల వల్ల కలిగే నష్టాలను నివారించడానికి చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి చట్టపరమైన మార్పులకు కూడా శ్రీకారం చుడుతున్నారు. గతంలో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల (పంచాయతీ, మునిసిపల్) ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించే నిబంధన ఉండేది. అయితే, జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు ఈ ఇద్దరు పిల్లల పరిమితి నిబంధనను ఏపీ ప్రభుత్వం తొలగించింది. ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు కూడా ఎన్నికల్లో పోటీ చేసేలా చట్టాన్ని సవరించడమే కాకుండా, ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం యోచిస్తోంది.
Also Read:Fresh US Strikes on Iran: ఇరాన్‌పై అమెరికా దాడి.. ట్రంప్ యాక్షన్ మళ్లీ మొదలైంది!