Homeక్రైమ్హైద‌రాబాద్‌లో ఘోర ప్ర‌మాదం...! బొలెరో వాహ‌నం ఢీ...ముగ్గురు మ‌హిళ‌ల మృతి...

హైద‌రాబాద్‌లో ఘోర ప్ర‌మాదం…! బొలెరో వాహ‌నం ఢీ…ముగ్గురు మ‌హిళ‌ల మృతి…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: హైద‌రాబాద్‌లోని శంషాబాద్ స‌మీపంలో గురువారం శాతంరాయి వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఉద‌యం బ‌స్ కోసం వేచి చూస్తున్న హిళ‌ల‌పైకి బొలెరో వాహ‌నం దూసుకెళ్లిన ఘ‌ట‌న‌లో ముగ్గ‌రు మ‌హిళ‌లు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో మ‌హిళ‌కు తీవ్ర గాయాల‌య్యాయి. కాగా మిర్చి లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం ముందు వెళ్తున్న వాహనాన్ని క్రాస్ చేయాలని చూసింది. అయితే ఒక్కసారిగా వాహనం స్కిడ్ అవడంతో బస్టాప్‌లో ఉన్న మహిళలపైకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు మహిళలు వాహనం కింద నలిగిపోయారు.

Also Read:ఓటీటీకి వచ్చేసిన ‘పెద్ది’: అదనపు సన్నివేశాలతో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా.. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధిత మహిళల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Also Read:Fresh US Strikes on Iran: ఇరాన్‌పై అమెరికా దాడి.. ట్రంప్ యాక్షన్ మళ్లీ మొదలైంది!

 

తాజావార్తలు