క్రైమ్ మిర్రర్, జాతీయం:- ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం మరో ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఈ కొత్త యాడ్-ఆన్ ప్లాన్‌తో వినియోగదారులు కేవలం రూ. 55 లకే భారీ స్థాయిలో వినోదాన్ని పొందవచ్చు.
ప్లాన్ వివరాలు,ధర:- ఈ ప్లాన్ ధర రూ. 55. ఇది ఒక యాడ్-ఆన్ ప్లాన్. ఈ రీఛార్జ్‌తో వినియోగదారులు 1000కి పైగా లైవ్ టీవీ ఛానల్స్‌ను వీక్షించవచ్చు. ఇందులో 150కి పైగా ప్రీమియం ఛానల్స్ కూడా అందుబాటులో ఉంటాయని జియో సంస్థ తెలిపింది. జియోస్టార్ , సోనీ, సన్ టీవీ, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ వంటి ప్రముఖ నెట్‌వర్క్‌ల ఛానల్స్ ఈ ప్లాన్‌లో చేర్చబడ్డాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుంది.
ఛానల్స్‌ను ఎలా యాక్సెస్ చేయాలి?
వినియోగదారులు ఈ రూ. 55 ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకున్న తర్వాత, జియోటీవీ (JioTV) యాప్‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా ఈ ఛానల్స్‌ను యాక్సెస్ చేయవచ్చని జియో స్పష్టం చేసింది.తక్కువ ధరలో ఎక్కువ వినోదాన్ని కోరుకునే వినియోగదారులకు ఈ కొత్త ఆఫర్ ఎంతగానో ఉపయోగపడుతుందని జియో భావిస్తోంది.
ఓటీటీకి వచ్చేసిన ‘పెద్ది’: అదనపు సన్నివేశాలతో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్