HomeసినిమాColors Swathi Wedding: కలర్స్ స్వాతి రెండో పెళ్లి.. దర్శకుడితో ఏడడుగులు.. వెడ్డింగ్ ఫోటోలు వైరల్!

Colors Swathi Wedding: కలర్స్ స్వాతి రెండో పెళ్లి.. దర్శకుడితో ఏడడుగులు.. వెడ్డింగ్ ఫోటోలు వైరల్!

టాలీవుడ్ నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని వివాహం చేసుకున్నట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ అందమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

స్వాతి గతంలో 2018లో మలయాళీ పైలట్ వికాస్ వాసును వివాహం చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఆ తర్వాత సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్న స్వాతి ఇటీవల మళ్లీ నటిగా బిజీ అవుతున్నారు.

రీ-ఎంట్రీలో భాగంగా ఆమె నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాకు శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, తర్వాత ప్రేమగా మారిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కుటుంబ సభ్యుల సమ్మతితో ఈ ప్రేమ పెళ్లిగా మారినట్లు సమాచారం. తాజాగా స్వాతి స్వయంగా పెళ్లి ఫోటోను పంచుకోవడంతో ఈ వార్తకు అధికారిక ధృవీకరణ లభించింది. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో ఆమె కొత్త జీవితానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చాలామంది ఆమె ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పోస్టులు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు స్వాతి పెళ్లిని ప్రస్తావిస్తూ సమంత పేరును కూడా చర్చలోకి తీసుకొస్తున్నారు. “అటు సమంత.. ఇటు స్వాతి.. ఇద్దరూ రెండో పెళ్లి కోసం దర్శకులనే ఎంచుకున్నారు” అంటూ వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం స్వాతి రెండో పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు