Homeఆంధ్ర ప్రదేశ్అనంత‌పురంలో ఉద్రిక్త‌త‌...!ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి...

అనంత‌పురంలో ఉద్రిక్త‌త‌…!ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి…

అనంత‌పురం,క్రైమ్‌మిర్ర‌ర్‌: జిల్లాలో రాజ‌కీయ వాతావ‌ర‌నం ఒక్క‌సారిగా వేడెక్కింది. దీంతో రాజ‌కీయ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. కాగా ప్రస్తుతం ఎంఎస్ రాజు, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నివాసాల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Also Read:Colors Swathi Wedding: కలర్స్ స్వాతి రెండో పెళ్లి.. దర్శకుడితో ఏడడుగులు.. వెడ్డింగ్ ఫోటోలు వైరల్!

గ‌త కొన్ని రోజులుగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం కొన‌సాగుతుంది. కాగా ఇప్పుడు ఇదీ ప‌తాక స్థాయికి చేరుకున్నాయి. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి సవాల్ విసిరారు. ఆరోపణలు నిరూపించలేకపోతే చెప్పుతో కొడతానంటూ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నివాసంలో ఇవాళ వైసీపీ శ్రేణుల సమావేశం జరుగుతోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నివాసానికి ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు చేరుకోగా, పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అక్కడికి తరలివస్తున్నారు.

Also Read:Prashna Ravan Case: ‘ప్రశ్న రావణ్’ ఫోన్ లో రాసలీలలు.. పలువురు యువతులతో అశ్లీల వీడియోలు, అసభ్య చేష్టలు!

ఇరువర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడికి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇంట్లో మారణాయుధాలు ఉన్నాయనే సమాచారం. తోపుదుర్తి ఇంట్లో రాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తనిఖీల సందర్భంగా పోలీసులతో ప్రకాష్‌రెడ్డి తండ్రి ఆత్మారామిరెడ్డి వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.

Also Read:Fresh US Strikes on Iran: ఇరాన్‌పై అమెరికా దాడి.. ట్రంప్ యాక్షన్ మళ్లీ మొదలైంది!

 

తాజావార్తలు