HomeUncategorizedబిఆర్ఎస్ పై కవిత బాంబ్...!

బిఆర్ఎస్ పై కవిత బాంబ్…!

  • రూ. 1400 కోట్ల పార్టీ ఫండ్ అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్

  • అదంతా ఏపీ కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేశారని ఆరోపణలు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పొలిటికల్ బాంబు పేల్చారు కల్వకుంట్ల కవిత. భారత్ రాష్ట్ర సమితి అధికారిక బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1400 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సింగరేణి బాయి బాట కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెంలోని పీవీకే 5 భూగర్భ గనిలోకి వెళ్లి కార్మికులతో మాట్లాడిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గులాబీ పార్టీ అగ్రనాయకత్వాన్ని టార్గెట్ చేసుకున్నారు. సంచలన వ్యాఖ్యలతో సాగిన ఆమె కామెంట్స్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ప్రకంపనలు రేపాయి.

పారదర్శకంగా వచ్చిన నిధులు కావు…

Also Read:ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు…!

భారత్ రాష్ట్ర సమితి ఖాతాలో మూలుగుతున్న రూ.1400 కోట్ల నిధులు సక్రమంగా, పారదర్శకంగా వచ్చినవి కావని ఆమె ప్రకటించారు. గత పది సంవత్సరాల గులాబీ పాలనలో క్విడ్ ప్రోకో పద్ధతిని అవలంబించి.. ఏపీకి చెందిన పలువురు పెద్ద కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన అక్రమ సొమ్ముగా వివరించారు. తెలంగాణ వనరులను, సాగునీటి ప్రాజెక్టులను పురుగు రాష్ట్ర కాంట్రాక్టర్లకు అప్పనంగా కట్టబెట్టి.. దానికి ప్రతిఫలంగా ఈ భారీ మొత్తాన్ని పార్టీ ఫండ్ గా మళ్ళించారని.. ఇందులో కేటీఆర్, హరీష్ రావుల పాత్ర ఉందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. అంతటితో ఆగని ఆమె ఒక ప్రతిపాదన చేశారు.. ఆ మొత్తం సొమ్మును తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు పంచి పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ సర్కిల్స్లో వైరల్ అవుతున్నాయి.

డిఫెన్స్ లో గులాబీ పార్టీ…

Also Read:సీఎం రేవంత్ వ్యూహం…!గోశాలలతో హిందూ ఓటు బ్యాంక్ పై గురి…

తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ సదుపాయం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు ఆ హామీ అమలు కాలేదు. అదే సమయంలో ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పార్టీ ఫండ్ ను అమరవీరుల కుటుంబాలకు పంచాలన్న కవిత డిమాండ్ ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలు నేటికీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని.. ఈ నిధులను వారికే కేటాయించడం ద్వారా కొంతైనా న్యాయం జరుగుతుందని కవిత స్పష్టం చేశారు. దీనిపై కేసీఆర్ తక్షణమే స్పందించి నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. తెలంగాణ సెంటిమెంటును, స్వరాష్ట్రవాదాన్ని మళ్లీ హైలైట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు భారత్ రాష్ట్ర సమితి ప్రయత్నిస్తున్న తరుణంలో.. తెలంగాణ నిధులను ఏపీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని షాక్ ఇచ్చాయి. గతంలోనే కెసిఆర్ స్వయంగా ప్రకటించారు దేశంలో ధనిక పార్టీ భారత్ రాష్ట్ర సమితి అని.. పార్టీకి ప్రత్యేక విమానం కూడా ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కవిత ప్రకటనతో అదంతా అక్రమం అని తేలింది. దీనిపై భారత రాష్ట్ర సమితి ఎలా స్పందిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు