Homeతెలంగాణఇప్పుడు ఎన్నికలు జరిగితే మాదే అధికారం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

ఇప్పుడు ఎన్నికలు జరిగితే మాదే అధికారం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఒకవేళ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 78 స్థానాలు సాధించి మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ సంచలన నిజం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించుకున్న సొంత సర్వేలోనే బయటపడిందని కేటీఆర్ బాంబు పేల్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని, మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.భయంతోనే సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు..సొంత సర్వేల్లో ఎదురైన ఈ చేదు నిజాలను చూసి తట్టుకోలేక, తీవ్ర భయాందోళనలతోనే సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, వారి వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన విమర్శించారు.

తెలంగాణలో కాసేపట్లో వర్షాలు: పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక!

తమిళనాడులో రాజ్యాంగ వివాదం…! రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజీనామాను కోరిన విజయ్ సర్కార్ …

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు