టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యామిలీ, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ నేపథ్యంలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా 14 రోజులపాటూ రిమాండ్ విధించారు.
అయితే అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలుసుకున్న స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ షెడ్యూల్స్ క్యాన్సిల్ చేసుకుని తన సతీమణి సురేఖతో కలసి బంజారా హిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళాడు. అయితే అప్పటికే బన్నీ ఇంటివద్ద ఉన్న పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి రావద్దని సూచించారు. అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్న రామ్ చరణ్ కూడా అల్లు అర్జున్ ఇంటికొచ్చాడు. ఇక టవర్ స్టార్ నాగబాబు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలుసుకున్న వెంటనే బయలుదేరి అల్లు అర్జున్ ఇంటికొచ్చాడు.
పుష్ప 2 సినిమా నిర్మాత రవిశంకర్, మరో టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దిల్ రాజు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లారు. దీంతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే కోర్టు విచారణాంతరం ఆలు అర్జున్ ని చంచల్ గూడ జైలుకి తరలించారు.