టాలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరో, నిర్మాత మంచు మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే మోహన్ బాబు తన ఇంటికి వచ్చిన మీడియా రిపోర్టర్లపై మైకు లాక్కొని దాడి చెయ్యడంతో రిపోర్టర్లు గాయపడ్డారు. దీంతో మోహన్ బాబు పై అటెంప్ట్ టూ మర్డర్ అలాగే మరిన్ని సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.
అయితే పోలీసులు మోహన్ బాబుని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నపటికే పరారీలో ఉన్నాడని దీంతో ఇంటితో పాటూ ఫార్మ్ హౌస్ ఇలా దాదాపుగా 5 చోట్ల గాలింపు చర్యలు చేపట్టారని పలు వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి. అలాగే మోహన్ బాబు జాడ కనిపించకపోవడంతో స్పెషల్ పోలీసులు బృందాలుగా ఏర్పడి వెతుకుతున్నారని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ విషయంపై పోలీసులు స్పందిస్తూ మోహన్ బాబు పరారీలో ఉన్నట్లు వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం మోహన్ బాబు పని మీద బయటి ప్రాంతాలకి వెళ్లాడని త్వరలోనే వచ్చి తన లైసెన్స్ వెపన్ ని పోలీసులకి హ్యాండోవర్ చేస్తున్నట్లు సమాచారం ఇచ్చాడని క్లారిటీ ఇచ్చారు. ఇక మోహన్ బాబు కోసం స్పెషల్ టీమ్స్ వెతుకుతున్నట్లు వినిపిస్తున్న వార్తల్ని కూడా కొట్టిపారేశారు.
Read More : అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్.. బన్నీ ఇంటికి చేరుకున్న మెగా ఫ్యామిలీలు