Homeతెలంగాణస్వాతంత్ర్య స్ఫూర్తితో మార్మోగిన మర్రిగూడ మండలం...!

స్వాతంత్ర్య స్ఫూర్తితో మార్మోగిన మర్రిగూడ మండలం…!

 

  • ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

  • సిఐ రాజు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ మునయ్య లు జాతీయ జెండా ఆవిష్కరణ.

 

మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): దేశభక్తి, జాతీయ స్ఫూర్తి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో, 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, పోలీస్‌స్టేషన్‌ తదితర ప్రాంతాలు జాతీయ పతాకాలతో కళకళలాడాయి. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు సిబ్బంది దేశభక్తి నినాదాలతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల భద్రతకు పోలీసులు నిరంతరం కట్టుబడి పనిచేస్తున్నారని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహనీయుల ఆశయాలను, ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజలకు రక్షణ కల్పించడం, శాంతిభద్రతలను కాపాడటం పోలీసుల ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు.

Also Read:త్రిష సంచలన పోస్ట్.. ‘ఇంత నాటకం సిగ్గుచేటు’ అంటూ షాకింగ్ కామెంట్స్

ప్రజలు చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని, సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వారి వివరాలు అందించడంలో, అడ్డుకోవడంలో ప్రజలు ముందుండాలి అని అన్నారు. మండల తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ జక్కర్తి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను నేటి తరాలు గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు, అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. దేశ స్వాతంత్ర్యం అనేది ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమని, ఆ స్వేచ్ఛ విలువను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, సిబ్బంది మరింత బాధ్యతతో పనిచేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేయడమే నిజమైన ప్రజాసేవ అని అన్నారు.

Also Read:అల్లు అర్జున్ స్వాతంత్య్ర దినోత్సవ ట్వీట్‌పై వివాదం.. నెటిజన్ల విమర్శలతో పోస్టు డిలీట్?

ప్రభుత్వం చేపడుతున్న భూ సర్వే విధానాలు, దాని ప్రాముఖ్యత గురించి వివరించారు. రేషన్ కార్డుల మంజూరు, మార్పుల ప్రక్రియ ప్రభుత్వం నిరంతర ప్రక్రియగా మార్చిందన్నారు. అనంతరం మిఠాయిలు పంచుకొని, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఎంపీడీఓ జి.సి. మున్నయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి భారతీయుడిలో దేశభక్తిని, బాధ్యతా భావాన్ని పెంపొందించే గొప్ప రోజు అన్నారు. గ్రామాల అభివృద్ధి కేవలం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు కూడా భాగస్వాములై తమ గ్రామాలను అభివృద్ధి దిశగా నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.

Also Read:భాగ్యశ్రీ బోర్సేకు మరో బిగ్ ఆఫర్.. నాని ‘బ్లడీ రోమియో’లో హీరోయిన్‌గా ఛాన్స్?

మర్రిగూడ మండలం నుండి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎం. అనిల్, ఉపాధిహామీ ఎపిఓ జయరాజు ల ఉత్తమ విధులను గుర్తించి, మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ల చేతుల మీదుగా, వారికి ప్రశంసా పత్రాలు అందుకోవడం జరిగింది. మండలంలోని ఆయా గ్రామపంచాయతీల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. సర్పంచులు, అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల సేవలను స్మరించుకున్నారు. పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలోనూ, జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాలు, కార్యాలయాలు జాతీయ జెండాలతో అలంకరించడంతో పండుగ వాతావరణం నెలకొంది. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది పరస్పరం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. దేశభక్తి, ఐక్యత, ప్రజాసేవ, అభివృద్ధి వంటి అంశాలపై పలువురు తమ సందేశాలను వినిపించారు. వేడుకల్లో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు