హైదరాబాద్‌లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఓ అపార్ట్‌మెంట్‌లో రహస్యంగా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. మాదాపూర్, కూకట్‌పల్లి జోన్‌కు చెందిన SOT పోలీసులు పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టారు.
దాడి సమయంలో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకుడితో పాటు అక్కడ ఉన్న నలుగురు కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి రూ.1,48,970 నగదుతో పాటు ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారంపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అపార్ట్‌మెంట్‌లో ఈ కార్యకలాపాలు ఎంతకాలంగా కొనసాగుతున్నాయి? ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
also read: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
