Homeజాతీయంఉచిత టికెట్‌ అడిగిన విద్యార్థినిని జెండర్‌ అడిగిన కండక్టర్‌.. సస్పెండ్‌ చేసిన అధికారులు

ఉచిత టికెట్‌ అడిగిన విద్యార్థినిని జెండర్‌ అడిగిన కండక్టర్‌.. సస్పెండ్‌ చేసిన అధికారులు

కేరళలో ఆర్టీసీ బస్సులో చోటుచేసుకున్న ఓ ఘటన వివాదానికి దారితీసింది. ఉచిత ప్రయాణానికి సంబంధించిన ‘జీరో టికెట్‌’ అడిగిన ఓ విద్యార్థినిని కండక్టర్‌ జెండర్‌ గురించి ప్రశ్నించడంతో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై ఆర్టీసీ విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టి, సంబంధిత కండక్టర్‌పై చర్యలు తీసుకున్నారు.

కొచ్చి జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాల ప్రకారం.. ఓ విద్యార్థిని టీషర్ట్‌, జీన్స్‌ ధరించి బస్సులో ప్రయాణిస్తోంది. ఆమెను అబ్బాయిగా భావించిన కండక్టర్‌ మహేశ్‌ రూ.15 విలువైన టికెట్‌ ఇచ్చినట్లు సమాచారం. అయితే విద్యార్థిని తనకు ఉచిత ప్రయాణానికి సంబంధించిన ‘జీరో టికెట్‌’ ఇవ్వాలని కోరింది.

ఈ క్రమంలో కండక్టర్‌ ఆమె జెండర్‌ ఏమిటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో తనను అవమానించేలా ప్రశ్నించారంటూ విద్యార్థిని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. విషయం ఆర్టీసీ విజిలెన్స్‌ విభాగం దృష్టికి వెళ్లడంతో అధికారులు విచారణ చేపట్టారు.

విచారణ అనంతరం కండక్టర్‌ మహేశ్‌ను సస్పెండ్‌ చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే కండక్టర్‌ మహేశ్‌ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. విద్యార్థిని విషయంలో జరిగినది కేవలం అపార్థం వల్లేనని, ఆమెను ఉద్దేశపూర్వకంగా అవమానించాలనే ఉద్దేశం తనకు లేదని వెల్లడించినట్లు సమాచారం.

ఈ ఘటనపై ఆర్టీసీ తీసుకున్న చర్యలు, పోలీసుల దర్యాప్తు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

also read: మాదాపూర్‌లో అపార్ట్‌మెంట్‌లో రహస్యంగా వ్యభిచార గృహం.. నలుగురు కస్టమర్లు అదుపులోకి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు