క్రైమ్ మిర్రర్ : నెల్లూరు జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కలువాయి మండలం వెంకటరామరాజుపేట సమీపంలో జాతీయ రహదారి 565పై వేగంగా వెళ్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. అనంతసాగరం మండలం పాతదేవరాయపల్లికి చెందిన షేక్ రసూల్ బాషా (47), మణికల సుధాకర్ (45) పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం చింతలపాలెం గ్రామంలో పనులు ముగించుకుని బైక్‌పై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వెంకటరామరాజుపేట సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన కారు వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
ప్రమాద తీవ్రతకు ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : విశాఖకు కొత్త శోభ…!
