Homeతెలంగాణమహిళా డాక్టర్‌పై దాడి.. పీహెచ్‌సీలో వ్యక్తి హంగామా

మహిళా డాక్టర్‌పై దాడి.. పీహెచ్‌సీలో వ్యక్తి హంగామా

క్రైమ్ మిర్రర్ : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ఓ వ్యక్తి హంగామా సృష్టించాడు. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి.. వైద్యం అందించిన మహిళా వైద్యురాలిపై దాడికి పాల్పడటంతో పాటు అడ్డుకునేందుకు ప్రయత్నించిన సిబ్బందిపైనా దురుసుగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆసుపత్రిలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మాయ కాలనీకి చెందిన దుద్యాల వెంకట తిరుపతి కాలికి గాయం కావడంతో కట్టు కట్టించుకునేందుకు స్థానిక పీహెచ్‌సీకి వెళ్లాడు. మండల వైద్యాధికారి శ్రీవాణి యాదగిరిగుట్టలో విధుల్లో ఉండటంతో, జిబ్లక్‌పల్లి పల్లె దవాఖానకు చెందిన డాక్టర్ శ్వేత అక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు.

తిరుపతికి డాక్టర్ శ్వేత పరీక్షలు నిర్వహించి కాలికి కట్టు కట్టడంతో పాటు మందులు సూచించినట్లు తెలుస్తోంది. అనంతరం అతడు ఒక్కసారిగా ఆగ్రహానికి గురై వైద్యురాలిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తితో పాటు విధుల్లో ఉన్న ఇద్దరు మహిళా సిబ్బందిపైనా దాడికి యత్నించి దుర్భాషలాడినట్లు సిబ్బంది తెలిపారు.cఅంతటితో ఆగకుండా ఆసుపత్రిలోని టేబుల్‌పై ఉన్న స్టెతస్కోప్‌ను తీసుకుని నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినట్లు సమాచారం. ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వైద్యురాలు, ఆసుపత్రి సిబ్బంది పోలీస్‌స్టేషన్‌కు చేరుకోగా, అక్కడ కూడా అతడు దాడికి ప్రయత్నించినట్లు వారు ఆరోపించారు.

ఆసుపత్రిలో జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మహిళా వైద్యురాలిపై దాడి ఘటనపై వైద్య సిబ్బంది, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందికి భద్రత కల్పించడంతో పాటు ఘటనకు బాధ్యుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
also read : మాదాపూర్‌లో అపార్ట్‌మెంట్‌లో రహస్యంగా వ్యభిచార గృహం.. నలుగురు కస్టమర్లు అదుపులోకి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు