Homeక్రైమ్భర్త ఫోన్ ఎత్తలేదన్న మనస్తాపంతో వివాహిత బలవన్మరణం

భర్త ఫోన్ ఎత్తలేదన్న మనస్తాపంతో వివాహిత బలవన్మరణం

భర్త తన ఫోన్‌ కాల్ కు స్పందించలేదన్న కారణంతో ఓ వివాహిత ఘోర నిర్ణయం తీసుకుంది. మనస్తాపానికి గురైన ఆమె ఎలుకల మందు తీసుకోవడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో విషాదం నింపింది.

సమాచారం ప్రకారం.. ఈ నెల 2న అఖిల తన పాపను భర్తకు వీడియో కాల్ ద్వారా చూపించేందుకు ప్రయత్నించింది. అయితే ఆయన ఫోన్‌ కాల్‌కు స్పందించకపోవడంతో ఆమె తీవ్రంగా బాధపడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అత్తగారింటికి వెళ్లిన అఖిల.. మనస్తాపంతో ఎలుకల మందు తీసుకుంది.

కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున అఖిల మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి తీసుకున్న నిర్ణయానికి దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు.

also read: మదనపల్లిలో లేడీ డాన్ అరెస్ట్.. ఇంట్లో కీలక పత్రాలు స్వాధీనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు