Homeక్రైమ్ఢిల్లీలో మణిపూర్ సంగీత కళాకారుడి దారుణ హత్య...!

ఢిల్లీలో మణిపూర్ సంగీత కళాకారుడి దారుణ హత్య…!

న్యూఢిల్లీ, క్రైమ్ మిర్రర్: దక్షిణ ఢిల్లీలోని కిలోకరి గ్రామంలో మణిపూర్‌కు చెందిన ప్రముఖ సంగీత కళాకారుడు, సంగీత ఉపాధ్యాయుడు చోంగ్తామ్ విక్రమ్ సింగ్ (54) దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి తన ఇంటి బయట కొందరు వ్యక్తులు పెద్దగా అరుస్తూ, మద్యం సేవిస్తూ హంగామా చేయడాన్ని విక్రమ్ సింగ్ ప్రశ్నించడంతో వివాదం తలెత్తినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. కిలోకరిలోని తన అపార్ట్‌మెంట్‌లో మూడో అంతస్తులో నివసించే విక్రమ్ సింగ్ ఆదివారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో చెత్త వేయడానికి కిందకు వచ్చారు. అదే సమయంలో ఇంటి సమీపంలో కొందరు డెలివరీ సిబ్బంది, ధాబా సిబ్బంది పెద్దగా శబ్దం చేస్తూ మద్యం సేవిస్తున్నట్లు గుర్తించారు. శబ్దం తగ్గించాలని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయన సూచించడంతో మాటామాటా పెరిగింది.

Also Read: కేబినెట్‌లోకి రాజగోపాల్‌రెడ్డి!?.. వెంకట్‌రెడ్డి విషయంలో ఇదే జరుగుతోంది.! 

వివాదం తీవ్రరూపం దాల్చడంతో నిందితులు విక్రమ్ సింగ్‌పై దాడికి దిగినట్లు పోలీసులు తెలిపారు. ఆయనను కొంతదూరం వెంబడించి ఇంటి మెట్ల వరకు వెళ్లి కొట్టినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించినట్లు సమాచారం. దాడిలో తీవ్రంగా గాయపడిన విక్రమ్ సింగ్‌ను ఆయన కుమారుడు వెంటనే హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సోమవారం ఆయన మృతి చెందారు. వైద్యుల ప్రకారం తీవ్రంగా కొట్టడంతో తలకు, శరీరానికి బలమైన గాయాలు కావడంతో హెమరేజిక్ షాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

ఏడుగురు అరెస్ట్.. మైనర్ అదుపులో…

Also Read:వైసీపీకి విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్: రెచ్చగొడితే నష్టం మీకే!

ఈ ఘటనపై సన్‌లైట్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో డెలివరీ సిబ్బంది, ధాబా సిబ్బంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మణిపూర్‌లో విషాదం…

Also Read:పోలీసుల దౌర్జన్యం వెనుక సీఎం రేవంత్: ‘దుశ్శాసన సభ’గా మారిందంటూ

చోంగ్తామ్ విక్రమ్ సింగ్ మణిపూర్ రాక్ మ్యూజిక్‌లో గుర్తింపు పొందిన కళాకారుడు. 1980లలో ‘Phoenix’ బ్యాండ్‌కు లీడ్ గిటారిస్ట్‌గా పనిచేశారు. అనంతరం సంగీత బోధనపై దృష్టి పెట్టి ఢిల్లీలో మ్యూజిక్ టీచర్‌గా సేవలందించారు. ఆయన మృతి మణిపూర్ సంగీత, సాంస్కృతిక వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై మణిపూర్‌కు చెందిన సామాజిక సంస్థలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో నివసిస్తున్న ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘటనపై స్పందిస్తూ నిందితులపై వేగంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నపాటి శబ్ద వివాదం చివరకు ఓ ప్రముఖ సంగీత కళాకారుడి ప్రాణాలను బలిగొనడం ఢిల్లీలో తీవ్ర కలకలం రేపుతోంది. కేసులో అరెస్టయిన నిందితులను పోలీసులు విచారిస్తూ, దాడికి దారితీసిన పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు